Brahma, Vishnu, Maheshwar దేవుళ్లలో ఎవరు గొప్ప అనే ప్రశ్నలు అప్పుడప్పుడు వస్తుంటాయి. కొందరేమో విష్ణువు గొప్పవాడంటే మరికొందరు శివుడే సర్వాంతర్యామి అంటారు. ఎవరి శక్తియుక్తులైనా సమయానికి బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలో విష్ణువు, శంకరుడు ఎవరు గొప్పవారనే వాదనలు వస్తూనే ఉంటాయి. ఈ అనుమానం దేవి భాగవంతలో మునులకు కూడా వచ్చిందట. దీంతో వారు సూత మహర్షిని ప్రశ్నించారట. విష్ణువు శివుడిని ఎందుకు ఆరాధించాడని అడిగారట.
దానికి ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారట. ఎవరైనా సరే మానవ రూపంలో ఉన్నప్పుడు తమ శక్తులు నిర్వీర్యమైపోతాయి. దీంతో వారు కూడా దేవుడిని వేడుకోవాల్సిందే. అలా మానవ రూపంలో ఉన్న విష్ణువు శివుడిని ప్రార్థించడం సమంజసమే అని చెప్పాడట. రాముడు కూడా వాలిని చెట్టు చాటు నుంచి చంపడానికి కారణం తనకు దివ్య శక్తులు లేకపోవడమే.
మానవ రూపంలో ఉన్నప్పుడు వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి. పెద్దలను గౌరవించాలి. గురువులను పూజించాలి. బ్రాహ్మణులను సత్కరించాలి. దేవతలను ఆరాధించాలి. అందుకే ఆపదల సమయంలో శివుడిని కొలవడం సహజమే. మనకు అవసరమైన సందర్భాల్లో ఎంతటి వారైనా సాయం కోసం అర్థించాల్సిందే. దేవుడి సాయం తీసుకోవాల్సిందే.
మానవ రూపంలో ఉన్నప్పుడు ఒత్తిళ్లకు బాధపడటం, దుఖపడటం, సంతోషించడం, స్త్రీలతో సాంగత్యం కలిగి ఉండటం వంటి సాధారణ విషయాలకు లోబడి ఉండాల్సిందే. త్రిమూర్తులలో బ్రహ్మ కన్నా విష్ణువు, విష్ణువు కన్నా శివుడు అధికులు. దీంతో శివుడిని వేడుకోవడంలో తప్పులేదు. మానవుల రూపంలో ఉన్న విష్ణువు శివుడిని కొలిచి తన కోరికలు తీర్చమని అడగడం మామూలే.