Most educated woman Delhi CM: అతిషి మర్లెనా ఢిల్లీ తదుపరి సీఎం కానున్నారు. మంగళవారం జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ అతిషి పేరును సీఎం పదవికి ప్రతిపాదించగాచ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని తర్వాత ఆయన సీఎం అవుతారని నిర్ణయానికి వచ్చారు. అతిషి ఢిల్లీ సీఎం పీఠం అధిరోహించునున్న మూడో మహిళగా నిలవనున్నారు. ఇంతకు ముందు బీజేపీ నుంచి సుష్మాస్వరాజ్, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్‌లు ఢిల్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు విద్యావంతులనే చర్చ సాగుతున్నది.
షీలా దీక్షిత్ ఎంత వరకు చదువుకున్నారు?
కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత్ కూడా పదేళ్లపాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. షీలా దీక్షిత్ 1938 మార్చి 31న పంజాబ్‌లోని కపుర్తలాలో జన్మించారు. ఆమె తన ప్రాథమిక విద్యను ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్లో పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మిరాండా హౌస్ నుంచి చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. మిరాండా హౌస్‌లో చదువుతున్న సమయంలోనే క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు.
సుష్మా స్వరాజ్ విద్యాభ్యాసం?
బీజేపీ సీనియర్ నేత, దిగంగత సుష్మా స్వరాజ్ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేశారు. 1953 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కాంట్‌లో సుష్మా స్వరాజ్ జన్మించారు. సుష్మా స్వరాజ్ ప్రారంభ విద్యాభ్యాసం అంబాలా కాంట్‌లోని సనాతన్ ధర్మ కళాశాలలో జరిగింది. సుష్మ గ్రాడ్యుయేషన్ వరకు అంబాలాలో చదువుకున్నారు. సనాతన్ ధర్మ కళాశాల నుంచి సంస్కృతం, రాజకీయ శాస్త్రంలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు సుష్మా. ఆ తరువాత చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం చదివారు. అంబాలా కంటోన్మెంట్ నుంచి సుష్మ ఉత్తమ విద్యార్థిని అవార్డును అందుకున్నారు.
అతిషి ఎంత వరకు చదివారంటే ?
ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతల్లో అతిషి మర్లెనా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆమె 2012 నుంచి ఆప్‌లో కొనసాగుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుల్లో అతిషి ముందుంటారు. 1981 జూన్ 8న ఢిల్లీలో జన్మించిన అతిషి తన పాఠశాల విద్యను ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్ నుంచి పూర్తి చేశారు..సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, డీయూ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విదేశాల్లోనూ విద్యనభ్యసించారు. చెవెనింగ్ స్కాలర్‌షిప్‌పై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ప్రాచీన, ఆధునిక చరిత్రలో మాస్టర్స్ పొందారు.