Jabardasth Naresh :
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు జబర్దస్త్ నరేశ్ (పొట్టి నరేశ్). ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు పొట్టి నరేశ్. ఈయన అసలు పేరు పొట్టి రమేశ్. ఈ షోతో పాటు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లాంటి షోలలో కూడా ఆయన కనిపిస్తూనే ఉంటారు. ఆయన ‘బుల్లెట్ భాస్కర్’ స్కిట్ లో బాగా ఫేమస్ అయ్యారు. సుధాకర్, బుల్లెట్ భాస్కర్, పొట్టి నరేశ్ ఈ కాంబోకు జబర్దస్త్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో పాటు హైపర్ ఆదితో కూడా ఆయన చేసిన స్కిట్లు భారీగా పేలుతుంటాయి. అయితే ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రస్తుతం చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆయన వయస్సు, కుటుంబం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జబర్దస్త్ నరేశ్ 17 జూలై, 2000లో జన్మించాడు. ప్రస్తుతం నరేశ్ వయస్సు (జూన్ 29 నాటికి) 23 సంవత్సరాలు. ఇక ఆయన ఎత్తు చూస్తే 4 అడుగుల అంగుళం ఉంటుంది. (4.1 ఫీట్స్) ఆయన వరంగల్ కు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు నరేశ్. స్థానికంగా బిర్లా ఓపెన్ మైండ్స్ అనే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు. తర్వాత గ్రాడ్యేయేషన్ హైదరాబాద్ లోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో పూర్తి చేశారు. చిన్న తనం నుంచి నటించాలనే కోరిక అతనిలో బలంగా ఉండేది. ఆ దిశగా అడుగులు వేద్దాం అనుకున్నాడు. జబర్దస్త్ కు రాకముందు ఆయన డాన్స్ లో కోచింగ్ తీసుకున్నాడు. ఆయన బుల్లితెరపై కనిపించిన మొదటి షో ‘ది షో జూనియర్స్’. దీనితో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. 2013లో జబర్దస్త్ కు వచ్చాడు నరేశ్.
2015లో త్రిపురాంభికా అనే యువతిని నరేశ్ వివాహం చేసుకున్నాడు. ఆమె వయస్సు నరేశ్ కంటే 6 సంవత్సరాలు పెద్దది. వీరి వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. అయితే దానికి గల కారణాలు ఇప్పటి వరకూ తెలియలేదు. అయితే తన అత్తింటి వారు అతనిపై వరకట్నం కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు.