
Sankranthiki Vastunnam : (జనవరి 14)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు యునానిమస్ పాజిటివ్ వచ్చింది. మూవీ చూసిన వారందరూ తెగ నవ్వుకుంటున్నామంటున్నారు. వెంకీ, ఐశ్వర్య, మీనాక్షిల నటన అద్దిరిపోయిందంటూ కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఈ సినిమాకు సంబంధించి మరొకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతనే బుల్లిరాజు పాత్రలో మెరిసిన ఛైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మరీ ముఖ్యంగా ఫస్టాప్ కు అద్దిరిపోయే రెస్పాన్స్ రావడానికి కారణం బుల్లిరాజు పాత్రలేనని సినిమా చూసిన వారందరూ చెబుతున్నారు. స్క్రీన్ పై ఈ బుడ్డోడు కనిపించినప్పుడల్లా థియేటర్లలోని ఆడియన్స్ మొహాలు నవ్వులతో వెలిగిపోతున్నాయి. ముఖ్యంగా గోదారి యాసలో ఈ పిల్లాడు చెప్పే డైలాగులకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ లో భాగమైన ఈ బుడ్డోడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి.
ఈ బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. మనిషి చూడ్డానికి బుడ్డోడే అయినా పేరు చూశారా ఎంత పెద్దగా ఉందో. ఈ పిల్లాడికి నటన అంటే చాలా ఇష్టమట. అందుకు కుటుంబ సభ్యుల సపోర్టు కూడా ఉందని సమాచారం. బుల్లిరాజు పాత్రకు రాసిన డైలాగ్స్ ను రేవంత్ అద్భుతంగా చెప్పడంతో అనిల్ రావిపూడి ఈ సినిమాకు రేవంత్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. అన్నట్లు రేవంత్ మంచి నటుడే కాక మంచి మాటకారి కూడా. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బుడ్డోడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అన్నట్టు ఈ బుడ్డోడు దిల్ రాజు బ్రదర్ శిరీష్ కుమారుడేనని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో చూడాలి.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ చేసే ఛైల్డ్ ఆర్టిస్టులు లేరు. రేవంత్ ఆ లోటును భర్తీ చేస్తాడేమో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ కావడంతో ఇతర సినిమాల్లోనూ మరీ ముఖ్యంగా అనిల్ రావిపూడి భవిష్యత్తు ప్రాజెక్ట్స్ లో సైతం రేవంత్ కు ఆఫర్స్ రావచ్చునని కామెంట్స్ వినిపిస్తున్నాయి.






