who will be the winner in WTC : జూన్ 7వ తేదీ (బుధవారం) నుంచి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విజేతగా ఎవరికి ప్రకటిస్తారని సందేహం నెలకొంది. దీని గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఉత్సాహ పడుతున్నారు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) సమరం మరో ఐదు రోజుల్లో మొదలవుతుంది. లండన్‌లోని ఓవల్ వేదికగా 11వ తేదీ వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఫైనల్స్ కోసం ఇప్పటికే రాహుల్ సేన లండన్ చేరుకుంది. వీరితో పాటు ఆస్ట్రేలియా జట్టు కూడా లండన్ కు చేరుకుంది. ఇరు జట్లలోని ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐపీఎల్-2023లో రెండు నెలలు తీరిక లేకుండా ఆడిన టీమ్ ఇండియా ఇప్పుడు డబ్ల్యూటీసీ ట్రోఫీని దక్కించుకోవాలని అనుకుంటోంది. విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, తదితర ఆటగాళ్లు ఇందులో గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరో వైపు ఆస్ట్రేలియా కూడా చాంఫియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.
మ్యాచ్ డ్రా అయితే..
ఒక వేళ వర్షం, ఇతర కారణాల వల్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ డ్రాగా ముగిస్తే ఇండియా, ఆస్ట్రేలియాను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇరు జట్లకు ట్రోఫీని అందజేస్తారు.ఇక ఐదు రోజుల్లో ఆట జరిగే సమాయానికి వర్షం పడితే మ్యాచ్ ను క్యాన్సిల్ చేసి రిజర్వ్ లో పెడతారు. ఈ మ్యాచ్ ను 12వ తేదీ నిర్వహిస్తారు. వర్షం లేకుండా 5 రోజులు ఆట సాగితే రిజర్వ్ డే ఉండదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విజేత జట్టుకు రూ. 13.22 కోట్ల ప్రైజ్‌మనీ, రన్నరప్ కు రూ. 6.61 కోట్లు దక్కనుంది. రెండు సీజన్లలో ఇండియా ఫైనల్స్‌కు చేరి చరిత్రను సృష్టించింది. గతేడాదిలో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సారి విన్నర్ గా నిలవాలనే పట్టుదలతో ఉంది టీమ్ ఇండియా.






