Bholashankar : చిరంజీవి భోళాశంకర్ ఆగస్టు11న విడుదల కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు ఒక పక్క రాజకీయాలు మరోపక్క ఉన్నాయి. దీంతో ఎవరికి కష్టమొచ్చినా చిరు నిలబడి పరిష్కరిస్తుంటారు. చిత్ర పరిశ్రమకు కావాల్సిన వాడిగా చిరు తన శక్తిమేరకు కష్టపడుతూనే ఉంటారు. పరిశ్రమకు ఏ కష్టమొచ్చినా తానున్నానని అండగా నిలుస్తుంటాడు. కానీ ఏపీలో రాజకీయాలు వన్ సైడ్ కే సాగుతున్నాయి. వారికి నచ్చకపోతే సినిమాను డిజాస్టర్ చేయడానికి వెనకాడటం లేదు.
బ్రో సినిమాకు తప్పుడు రివ్యూలు రాయించి సినిమాకు మైనస్ చేయడానికి కూడా వెనకాడలేదు. ఇప్పుడు భోళాశంకర్ కు కూడా అలా చేస్తే ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. కానీ చిరంజీవి అందరి కోసం పనిచేస్తున్నారు. వైసీపీ నేతలు చిరుకు వ్యతిరేకంగా పోరాటానికి దిగితే ఎవరు అండగా ఉంటారు. చిత్ర పరిశ్రమ చిరుకు మద్దతుగా నిలుస్తుందా?
వాల్తేరు వీరయ్య 200 రోజుల పండగలో చిరంజీవి మాట్లాడారు. చిత్రసీమలో రాజకీయాలు అవసరం లేదు. చిత్ర పరిశ్రమలోకి రాజకీయాలు వద్దని చెప్పారు. రాజకీయాలు వేరు సినిమాలు వేరుగా చూడాలన్నారు. చిత్ర పరిశ్రమలో ఎవరి కోసమో కాదని అందరికోసమని పేర్కొన్నారు. భాష, భావ వ్యక్తీకరణలో అందరు సమానమే అని సూచించారు. రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టొద్దని ప్రాధేయపడ్డారు.
వైసీపీ మంత్రులు మాత్రం సినిమాలనే ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్నారు. తమకు నచ్చని వారి సినిమాలు ఆడకుండా చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాన్ని సినిమా వాళ్లు ఖండించాల్సి ఉన్నా ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో భోళా శంకర్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. జగన్ సర్కారు భోళా శంకర్ ను టార్గెట్ చేసుకుంటే చిరుకు ఎవరు అండగా నిలుస్తారు.
చిత్రపరిశ్రమలో అందరి తరఫున మాట్లాడే చిరుకు ఇప్పుడు భయం పట్టుకుంది. భోళాశంకర్ కు నెగెటివ్ రివ్యూలు ఇస్తే ఎలా అని సందేహపడుతున్నారు. జగన్ సర్కారును నిలదీయాల్సిన బాధ్యత చిత్ర పరిశ్రమపై ఉంది. కానీ ఎవరు మాట్లాడటం లేదు. స్పందించడం లేదు. దీంతో వైసీపీ నేతల తీరుపై సహజంగానే విమర్శలు వస్తున్నా వాటిని తిప్పికొట్టగలిగే సత్తా ఉన్నవారెవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం ఇద్దరు ముగ్గురు పెద్దలైనా జగన్ సర్కారు తీరును ఎండగడితేనే మంచిది.