
బీఆర్ఎస్ అభ్యర్థి: మానిక్ రావు
కాంగ్రెస్ అభ్యర్థి: గీతా రెడ్డి
బీజేపీ అభ్యర్థి: స్పష్టత లేదు
—————-
గ్రౌండ్ రిపోర్ట్ : జహీరాబాద్ లో గెలిచేదెవరు?
గ్రౌండ్ రిపోర్ట్ : గీతారెడ్డిపై వ్యతిరేకత అధికార పార్టీ కలిసొస్తుందా?
గ్రౌండ్ రిపోర్ట్ : సమస్యలు తీరుతాయా?
—————————–
Zaheerabad Constituency : మెదక్ ఉమ్మడి జిల్లాలో మన బార్డర్ లో ఉన్న జహీరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి? మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఇక్కడ గతంలో గులాబీ పార్టీ జెండా ఎగురవేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయంలో దిగిన మానిక్ రావు తొలిసారి 2018లో ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి గీతారెడ్డిని ఓడించి గులాబీ జెండా ఎగురవేశారు.
గీతారెడ్డిపై ప్రజలు విశ్వాసం చూపడం లేదు. ఆమె గెలిచినా నియోజకవర్గానికి వచ్చింది లేదు. ఒకవేళ ఇంటికి వెళ్లినా ఇంత దూరం ఎందుకు వచ్చారని విసుక్కునే వారట. దీంతో ఆమెపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. రెండుసార్లు గెలిచిన గీతారెడ్డి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూసినా ఆమె ఆశలకు గండి కొట్టి ఆమెకు అధికారం దక్కకుండా చేశారు.
ఇక బీజేపీకి సరైన నాయకుడు లేడు. దీంతో ఇక్కడ బీజేపీ గెలవడం కష్టంగానే కనిపిస్తోంది. ఇక్కడ ముస్లిం ఓట్లు అధికంగా ఉండటంతో బీజేపీ గెలవడం సుసాధ్యంగా కనిపించడం లేదు. ఇక అధికార పక్షం బీఆర్ఎస్ పై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నియోజకవర్గంలో పనులేవీ జరగలేదని చెబుతున్నారు. దీనికి అధికార పార్టీ కూడా స్పందిస్తోంది.
మున్సిపాలిటీలో పనులు జరగలేదని అంటున్నారు. గ్రామాల్లో రోడ్లు సరిగా లేవని చెబుతున్నారు. నారింజ నీరు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయి. దీంతో ఇక్కడి నీరును ఇక్కడే నిలపాలని భావించినా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. చక్కెర పరిశ్రమ ఏర్పాటు చేయాలనే ఆశ కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వాలు మారినా పట్టించుకోవడం లేదు.
గీతారెడ్డిపై ఉన్న వ్యతిరేకత అధికార పార్టీకి కలిసి రానుందా? కొందరు మాత్రం మానిక్ రావుకు టికెట్ రావడం లేదని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం టికెట్ తనదే అని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జహీరాబాద్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. గీతారెడ్డికి మాత్రం టికెట్ వస్తుందనే చెబుతున్నారు. ఆమె రాష్ట్ర నేతగా ఉండటంతో ఆమెకు వేరే బాధ్యతలు అప్పగిస్తే ఇక్కడ 1957 నుంచి 1987 వరకు అధికారంలో ఉన్న బాగా రెడ్డి వారసుడికి టికెట్ ఇస్తారో లేదో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






