గ్రౌండ్ రిపోర్ట్: —
అసెంబ్లీ నియోజకవర్గం: ఉరవకొండ
టీడీపీ: పయ్యావుల కేశవ్
వైసీపీ: వై విశ్వేశ్వర్ రెడ్డి
Uravakonda Constituency Review : అనంతపురంలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ‘ఉరవకొండ’ ఒకటి. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. 2019లో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన ఈయన గెలుపొందారు. 1962 డీలిమిటేషన్ ఆర్డర్స్ లో భాగంగా ఈ నియోజవకర్గం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. నియోజవకర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు నిర్వహించగా 5 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ, రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు, ఒక సారి వైసీపీ విజయం సాధించాయి.
ఈ నియోజవకర్గంలో ప్రధానంగా ఐదు మండలాలు ఉన్నాయి. 1. విడపనకల్, 2. వజ్రకరూరల్, 3. ఉరవకొండ, 4. బెళుగుప్ప, 5. కుడైర్. ఇక ఉరవకొండలో ఓటర్ల సంఖ్య 2,15,741 (2019) ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఇద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కాగా, వైసీపీ నేత వై విశ్వేశ్వర్ రెడ్డి.
తెలుగుదేశం పార్టీ
నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడి ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇస్తున్నారు. ఒకసారి కాంగ్రెస్, మరో సారి టీడీపీ, ఇంకోసారి స్వతంత్ర అభ్యర్థి ఇలా పార్టీని వ్యక్తిని మార్చుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగానే గెలుపొందారు పయ్యావుల. గతంలో (2014) వై విశ్వేశ్వర్ రెడ్డితో పోటీ చేసి ఓటమి పాలైనా.. 2019లో మళ్లీ నియోజకవర్గం పగ్గాలు చేపట్టారు. 2004 నుంచి నాలుగు దఫాలుగా ఎన్నికలు జరగగా.. మూడు సార్లు పయ్యావులనే ఎమ్మెల్యేగా ఉన్నారు.
పయ్యావులకు టీడీపీలో మంచి పట్టు ఉంది. అక్కడ ఉన్న కేడర్ ను కలుపుకుంటూ పోవడంలో ఆయన సక్సెస్ అవుతూ వస్తున్నారు. దీనికి తోడు ప్రజలతో మమేకం అవుతుంటారు. ఇదంతా ఒక ఎత్తయితే ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆశించిన నిధులు లేక అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే నిర్వహించారు. ఇది ఆయనకు మైనస్ అయ్యే అవకాశం లేకపోలేదు. కానీ, ఉరవకొండ అంటే ప్రధాన ప్రత్యర్థులు ఇద్దరు మాత్రమే అని ఇప్పటి వరకు కనిపిస్తుంది. అందులో ఒకరు పయ్యావుల, రెండో వారు విశ్వేశ్వర్ రెడ్డి.
వైఎస్ఆర్‌సీపీ
ఉరవకొండలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది వైఎస్‌ఆర్సీపీ. 2004 నుంచి విశ్వేశ్వర్ రెడ్డి పయ్యావులతో తలపడుతూనే ఉన్నారు. ఇక్కడ పార్టీ కాకుండా ఇద్దరు వ్యక్తులు తలపడడం ఆనవాయితీగా వస్తుంది. వై విశ్వేశ్వర్ రెడ్డి, పయ్యావుల కేశవ్ ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతారు. కానీ 2004 నుంచి నాలుగు సార్లు తలపడగా ఒక్కసారి మాత్రమేు విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా వైసీపీ టికెట్ ఆయననే వరిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆయన గెలుపు కాస్త కత్తిమీద సామనే చెప్పవచ్చు.
ఉరవకొండ నియోజకవర్గం వైసీపీలో కొన్నాళ్లుగా వర్గపోరు పెరిగింది. దీన్ని కట్టడి చేయడంలో విశ్వేశ్వర్ రెడ్డి విఫలమైనట్లు వాదనలు వినిపిస్తున్నాయి. టికెట్ తనకే వస్తున్నా వర్గపోరు ఉంటే ముందుకు వెళ్లడం కాస్త కష్టమనే చెప్పవచ్చు. ఎన్నికలకు చాలినంత టైము ఉండడంతో ఇప్పటి నుంచే కేడర్ ను బలంగా చేసుకోకపోతే ముప్పు తప్పదని వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సారి ఇద్దరి మధ్య ఫైట్ మరింత టఫ్ అనే చెప్పవచ్చు.