
Who won in Vanaparthi?
Vanaparthi :
కాంగ్రెస్ అభ్యర్థి జి చిన్నారెడ్డి
బీజేపీ అభ్యర్థి
త్రిముఖ పోరు
——————–
గ్రౌండ్ రిపోర్డ్ : వనపర్తిలో గెలిచేదెవరు?
గ్రౌండ్ రిపోర్ట్ : బీఆర్ఎస్ కు కలిసొస్తుందా?
గ్రౌండ్ రిపోర్ట్: ఎవరి అంచనాలు వారివే
———————-
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి నియోజకవర్గం ప్రత్యేకమైనది. ఇక్కడ నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత బీఆర్ఎస్ 2018లో నిరంజన్ రెడ్డి తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డిపై 51865 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, చిన్నారెడ్డి కలిసి పనిచేసినా నిరంజన్ రెడ్డి చేతిలో ఓటమి చెందడం విశేషం.
నిరంజన్ రెడ్డికి 1,11,956 ఓట్లు రాగా చిన్నారెడ్డికి 60,271 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీ చేసిన అమరేందర్ రెడ్డికి మూడువేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. నిరంజన్ రెడ్డి 2009లో ఓడిపోయినా 2018లో విజయం సాధించారు. చిన్నారెడ్డి 1989, 1999, 2004, 2014లో విజయం సాధించారు. 2018లో ఓటమి పాలయ్యారు. ఇక్కడ చిన్నారె డ్డికి మంచి బలమున్నా నిరంజన్ రెడ్డి విజయం సాధించారు.
రావుల చంద్రశేఖర్ రెడ్డి 1994, 2009లో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ పదిసార్లు, టీడీపీ నాలుగు సార్లు, ఒకసారి బీఆర్ఎస్ విజయం సాధించాయి. 1957లో పద్మనాభ రెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందారు. ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి 1952లో ఇక్కడ విజయం సాధించారు టీడీపీ నేత డాక్టర్ బాలక్రిష్ణయ్య రెండు సార్లు గెలిచారు.
కె.కుముదినిదేవి రెండుసార్లు విజయం సాధించారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి చీఫ్ విప్ గా పనిచేశారు. 2002లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వనపర్తిలో పన్నెండుసార్లు రెడ్డి సామాజిక వర్గం గెలవడం జరిగింది. నాలుగుసార్లు బీసీలు గెలిచారు. చిన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినట్లు తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియడం లేదు. వనపర్తిలో ముక్కోణపు పోటీ ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలు రాబోయే ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్లాన్లు వేస్తున్నాయి. అధికారం దక్కించుకోవడం కోసం పాట్లు పడుతున్నాయి. నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
ReplyForward
|