
Director Teja : ప్రముఖ దర్శకుడు తేజ గురించి అందరికి తెలుసు. చిత్రంతో దర్శకుడిగా మారిన తేజ తరువాత జయం, నువ్వు నేను చిత్రాలతో దూసుకుపోయారు. నేనే రాజు నేనే మంత్రితో దగ్గుబాటి రాణాకు హిట్ ఇచ్చారు. తరువాత సీతతో ఫెయిల్యూర్ అయిపోయారు. ఇలా ఆయన ప్రస్థానంలో ఒడిదుడుకులు ఉన్నాయి. తన చిత్రాలతో ప్రజల్లో మంచి క్రేజీ సంపాదించుకున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. ఎప్పుడు ఏదో ఒక విషయంలో తనదైన శైలిలో మాట్లాడి అందరిని ఆలోచనల్లో పడేస్తుంటారు. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా బ్యాంకులు ఉండేవి. వాటిని రద్దు చేసి యూనియన్ బ్యాంకులో కలిపేశారు. ఇలా ఆ బ్యాంకు లేకుండా చేశారు. దీనిపై ఎవరు కూడా కనీసం పట్టించుకోలేదు.
అంత పెద్ద బ్యాంకును తీసేస్తే ఎవరైనా మాట్లాడారా? పట్టించుకున్నారా? ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారా? వారికి పౌరుషం లేదా? ఇంత దిగజారిపోతారా అని దర్శకుడు తేజ ప్రశ్నించడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో తేజ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకు తేజ ఇలా మాట్లాడుతున్నారు. బ్యాంకులతో ఆయనకు సంబంధం ఏమిటి?
ఇప్పుడు ఆంధ్రాబ్యాంకు ప్రస్తావన ఎందుకు వచ్చింది. అవి తీసేసి దాదాపు రెండేళ్లు అవుతోంది. తేజ మాటల్లో మర్మమేమిటి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అనే విషయాలపై అందరికి సవాలక్ష ప్రశ్నలు వస్తున్నాయి. తేజ మాటల్లోని అంతరార్థం ఏమిటో తెలియడం లేదు. బ్యాంకుల ప్రస్తావన తీసుకొచ్చి ఏం సాధిస్తారో వేచి చూడాల్సిందే.