prison : జగత్తుకు అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ. అలాంటి అమ్మ నేల మీదకు వచ్చి శరన్నవరాత్రుల్లో పూజలందుకుంటున్న వేళ మనుషులే కాదు.. పశు పక్షాదులు, క్రిమి కీటకాలు సైతం కడుపునిండా ఇష్టా భోజనంతో ఆనందంగా ఉండాల్సిందే. అందుకే శరన్నవరాత్రుల్లో ఆయా రాష్ట్రాల్లో వారి వారి సంప్రదాయాలకు సంబంధించి నిత్యాన్నదానాలు, ప్రసాదాల వితరణ చేస్తూనే ఉంటారు. అయితే పశ్చిమ బెంగాల్ లో ఒక ఆచారం ఉంది. అక్కడి జైల్లలోని ఖైదీలకు శరన్నవరాత్రుల్లో భాగంగా చికెన్, మటన్, ఫిష్, వెజ్ ఇలా వారికి నచ్చిన బిర్యాణీలను ఆహారంగా ఇస్తారు. షష్ఠి నుంచి దశమి వరకు దుర్గా పూజ సమయంలో ఖైదీలకు మటన్ బిర్యానీ, బసంతి పులావ్ వంటి ప్రత్యేక బెంగాలీ వంటకాలను అందిస్తారు. దుర్గామాత ఉత్సవాల్లో ఖైదీలను భాగస్వామ్యం చేయాలనుకునేందుకు ఉత్సవాల్లో ఖైదీలను భాగస్వాములను చేస్తారు. ఖైదీలతో పాటు అండర్ ట్రయల్ లో ఉన్న వారికి సైతం ఈ మాంసాహార భోజనం అందిస్తారు. అయితే ఇది అన్యమతస్తులకు వర్తించదని ఒక వేళ వారు కూడా అమ్మవారి నైవేద్యంగా స్వీకరిస్తే తప్ప పెట్టమని జైలు అధికారులు చెప్తున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా 59 జైళ్లలో 26,994 మంది పురుషులు, 1,778 మంది మహిళలు ఉన్నారు. వీరందరికీ దుర్గా పూజలు పూర్తయ్యే వరకు వారి ఇష్ట ప్రకారం భోజనం అందిస్తామని అధికారులు చెప్తున్నారు.
దుర్గా పూజ మెనూ..
1. రైతాతో మటన్ బిర్యానీ (మిశ్రమ పెరుగు)
2. బసంతి పులావ్ (పసుపు పులావ్)
3. మాచెర్ మాతా దియే పుయ్ షాక్ (చేప తలతో మలబార్ పాలకూర)
4. మాచెర్ మాతా దియే దాల్ (చేప తలతో పప్పు)
5. లూచి-చోలార్ దాల్ (పూరీ మరియు బెంగాలీ చనా దాల్)
6. పాయెష్ (బెంగాలీ గంజి)
7. చికెన్ కర్రీ
8. అలు పోటోల్ చింగ్రి (కోణాల పొట్లకాయ మరియు బంగాళాదుంపతో రొయ్యలు)