
బీజేపీ పైనే అనుమానాలు
అయితే ఇక్కడ ఒకే దేశం.. ఒకే చట్టాన్ని వ్యతిరేకంచలేం కావచ్చు. దీని వల్ల కూడా ఎన్నో ఉపయోగాల ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తించాల్సింది అమలు చేస్తామని చెబుతున్న బీజేపీ నాయకుల గత చరిత్రే. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుసుకుని ప్రస్తుతం వీరంతా రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ది పొందాలనే ప్రయత్నమే ఇదని కొందరి అభిప్రాయం కూడా. ఆరెస్సెస్ ఒక్కో నినాదాన్ని అమలు చేస్తూ వస్తున్న ప్రధాని మోదీ, భారతీయ జనసంఘ్ నినాదాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ఇది బీజేపీ మేనిఫెస్టోలో ప్రతీ సారి ఉంటున్నా, తొమ్మిదేళ్లుగా ఎలాంటి అడుగులు పడలేదు. మళ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు తెరపైకి తెచ్చింది. ఒక దేశంలో కొందరికి రెండు చట్టాలు ఎందుకు వర్తించాలన్నది బీజేపీ ప్రధాన వాదన. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు, వచ్చే ఏడు సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ వాదనను మరోసారి తెరపైకి తెచ్చింది కేంద్రం. ఉమ్మడి పౌర స్మృతి ఈ దశలో అవసరం లేదని లేదా వాంఛనీయం కూడా కాదని స్పష్టంగా చెబుతూ 2018లో 21వ లా కమిషన్ ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. అయితే ఇదంతా పట్టించుకోకుండా మళ్లీ కేంద్రం ఈ విషయాన్ని తెరపైకి తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో మెజారిటీ ఉండడంతో, పార్టీ అజెండాను పక్కాగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతున్నది. ముమ్మారు తలాక్ చెప్పే విధానాన్ని రద్దు చేశారు.
ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. దేశంలో ఇప్పుడు కొన్ని అంశాల్లో అందరికీ ఒకే చట్టం లేదు – ముఖ్యంగా వివాహ చట్టాలు.. దేశంలో ప్రజా చట్టాలకు భిన్నంగా మతపరమైన చట్టాలున్నాయి. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు అమలవుతున్నాయి. ట్రిపుల్ తలాక్ వంటి వివాదాలు ఈ కారణంగానే వస్తున్నాయి. మతపరమైన అచారాలు, సంప్రదాయాలకు అతీతంగా భారత భూభాగం పరిధిలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడం ఉమ్మడి పౌరస్మృతి లక్ష్యం. మత చట్టాలను రద్దు చేసి.. యూనిఫాం సివిల్ కోడ్ ద్వారా అందరికీ అన్ని అంశాల్లో వర్తించే చట్టాలను తీసుకు రావాలని కేంద్రం భావిస్తోంది. అంటే.. ఇక్కడ ఇకపై మతాల చట్టాలు చెల్లవు. పెళ్లి, దత్తత, వారసత్వ హక్కుల్లో ఒకే విధానం. దేశవాసులందరికీ ఒకే రాజ్యాంగం వర్తిస్తుంది. ఉమ్మడి వివాహ చట్టం అమల్లోకి వస్తుంది. ఇందులో వివాదాలకు తావు లేదు.
అయితే ఉమ్మడి పౌరస్మృతి అమలుకు అనువైన వాతావరణం ఉండాలి. ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టకూడదు. క్రైస్తవులు ఎక్కువగా ఉండే నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్ చట్టాలను రూపొందించుకున్నాయి. హిందువుల్లో.. కొడుకులతో సమానంగా కూతుళ్లకు వారసత్వ ఆస్తిలో వాటా పొందేలా 2005లో చట్టాలను సవరించారు. కానీ.. దీనికంటే ముందే ఐదు రాష్ట్రాలు.. మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి. ఉమ్మడి పౌరస్మృతిని కేవలం ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం జరిగింది. కానీ హిందువులు, క్రైస్తవులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెబుతూంటారు. దేశ సమైక్యత కోసం యూనిఫాం సివిల్ కోడ్ ఉండాలని సుప్రీంకోర్టు చెబుతున్నది. అందరికీ ఆమోదయోగ్యంగా యూనిఫాం సివిల్ కోడ్ ను అమల్లోకి తీసుకు వస్తే పర్వాలేదు. కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తే దీర్ఘ కాలలో దేశానికి చేటు చేసినట్లవుతుంది.
ReplyForward
|