ఎప్పుడు చేయాలంటే?
ఒక వ్యక్తి జన్మనక్షత్రం ప్రకారం ఆ నిర్దిష్ట తేదీ యోగ, తిథిని పరిగణనలోకి తీసుకొని హోమం చేసే తేదీని నిర్ణయిస్తారు.
హోమం ప్రయోజనాలు..
ఇది ప్రభుత్వ సంబంధిత సమస్యలు లేదా.. అడ్డంకులను అధిగమించేందుకు సహాయపడుతుంది. ఒక వ్యక్తి, కుటుంబాన్ని కష్టాలు, డబ్బు సంబంధిత బాధల నుంచి రక్షిస్తుంది. సంగీతం, జ్ఞానం పొందేందుకు సహాయపడుతుంది. అనుభవజ్ఞులైన పురోహితులు హోమం చేయిస్తారు.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రాజ శ్యామలా యాగం నిర్వహిస్తున్నారు. తొలిరోజు పూజలు, యాగ క్రతువుల్లో చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి పాల్గొన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేందుకే చంద్రబాబు ఈ యాగం చేస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
50 మంది ఋత్విక్కులు (వేద పండితులు) పాల్గొనే యాగం ఆదివారంతో ముగియనుంది. రాజ శ్యామలా యాగం అనేది రాజా మాతంగి దేవి ఆరాధన చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఆచారాన్ని అడ్డంకి లేకుండా పూర్తి చేయడానికి గణపతి పూజతో ప్రారంభమవుతుంది.
విశాఖపట్నం శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర రాజా శ్యామలా యాగం క్రమం తప్పకుండా నిర్వహిస్తుండడం గమనార్హం. గత ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు కోసం ఆయన ఇలా చేశారు.