Bakrid :
ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ బక్రీద్. బక్రా అంటే గొర్రె ఈద్ అంటే పండగ. అంటే మాంసాహారం విందులా చేసుకునే పండుగ. త్యాగాలకు ప్రతీకగా ఈ పండగను చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు దీన్ని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. మాంసాహార వంటలతో విందులు చేస్తారు. ఖుర్బానీ ఏర్పాటు చేసి సంతోషంగా గడుపుతారు.
ఇస్లామిక్ క్యాలెండర్ లో పన్నెండో నెలలో పదో రోజును బక్రీద్ గా జరుపుకుంటారు. తొమ్మిదో రోజును అరఫా దినంగా చెబుతారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లోని ముస్లింలందరు జూన్ 28న అరఫాత్ జరుపుకున్నారు. తెల్లవారి బక్రీద్ అంటే 29న హజ్ కీలక ఆచారమైన అరాఫత్ దినం తరువాత ఈద్ ఉల్ అదాను జరుపుకోవడం ఆనవాయితీ.
త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ ను ముస్లింలు జరుపుకుంటారు. ఉదయం నమాజ్ చేసి తరువాత మాంసాహార వంటకాలతో విందు ఏర్పాటు చేస్తారు. అల్లా ఆజ్ణ మేరకు తన కుమారుల్లో ఒకరిని త్యాగం చేయడానికి మహమ్మద్ ప్రవక్త సిద్ధమవుతాడు. ఈ త్యాగానికి ప్రతీకగా ఈద్ అల్ అదా జరుపుకుంటారు. కానీ అల్లా జోక్యం చేసుకుని ఆయన కొడుకును బలివ్వడానికి ఇష్టపడడు. ప్రత్యామ్నాయం చూపుతాడు. దేవుడిపై నమ్మకం ఉంచితే దేవుడే కాపాడతాడనే ఉద్దేశంతో ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది.
బక్రీద్ రోజు మేకలు, గొర్రెలను బలిస్తారు. ఆ మాంసాన్ని మూడు భాగాలు చేస్తారు. మొదటి భాగం వారి ఇంటిలో ఉంచుకుంటారు. రెండో భాగం బంధువులు, స్నేహితులకు పంచుతారు. మూడో భాగం అందరికి పంచిపెడతారు. ఇలా ఖుర్బానీ ఏర్పాటు చేసి అందరు సంతోషంగా గడుపుతారు. ఖుర్బానీని దానంగా ఇస్తారు.దీంతో వారి మధ్య సోదరభావం పెరుగుతుం ది. ఇదే ఈ పండుగ విశిష్టత.