
Ravana : ‘ఆదిపురుష్’ సినిమా నుంచి రాఘవు (రాముడు)డి లుక్ తో పాటు జానకి (సీత), లక్ష్మణుడు, హనుమంతుడి ఇలా చాలా వచ్చాయి. కానీ రెండు ట్రయల్స్ లలో (ఇప్పుడు రిలీజ్ చేసిన ఫైనల్) రావణుడిని పాత్ర వేసిన సైఫ్ అలీఖాన్ లుక్ మాత్రం ఎందుకు బయట పెట్టలేదు..? ఈ పశ్న సినీ విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు. రెండు ట్రయిలర్స్ లలో సైఫ్ అలీఖాన్ కనిపించాడు. కానీ రావణుడి గెటప్ లో మాత్రం కాదు. కేవలం సీతను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన ఒక ముని వేషంలో మాత్రమే. అయితే రావణుడి ఒరిజినల్ గెటప్ ఎలా ఉంటుందన్నది మాత్రం ఇంకా బయటపెట్టలేదు.
టీజర్‌లో రావణుడిని చూపించిన విధానం చాలా మందికి నచ్చలేదు. ఓ వింత పక్షిపై, వికృతమైన గెటప్ లో చూపించారు. మరీ ముఖ్యంగా మరో వర్గానికి చెందిన వ్యక్తిగా రావణుడిని చూపించారు. టీజర్ లో రావణుడు ఉపయోగించే వాహనాన్ని కూడా తప్పుగా చూపించినట్లు అర్థం అవుతుంది. అప్పట్లో దీనిపై నెటిజన్లు విపరీతంగా కూడా స్పందించారు. సరిగ్గా అప్పటి నుంచే రావణాసురుడి గెటప్ బయటపెట్టకుండా యూనిట్ జాగ్రత్తపడుతూ వస్తుంది. రావణుడు కూడా హిందువేనని, ముఖ్యంగా పరమశివుడి భక్తుడని లుక్ ను మార్చాల్సిందేనంటూ టీజర్ రిలీజ్ టైమ్ లో డిమాండ్స్ కూడా వినిపించాయి. మరి ఆ లుక్ ను మార్చారా..? లేదా అనేది సస్పెన్స్ గానే ఉంది.
‘ఆదిపురుష్’పై భారీ అంచనాలున్నాయి. ఇక వివాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రాముడికి మీసాలు పెట్టారని, సీత చూడామణి రకరకాల వివాదాలు చుట్టు ముడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రావణుడి గెటప్ విడుదల చేస్తే, అది మరిన్ని వివాదాలకు దారితీసే ప్రమాదం ఉందని భావించి ఉండొచ్చు. అయితే మైథలాజికల్ మూవీ తీసేప్పుడు దాచిపెట్టడానికేం ఉండదు. ఇప్పుడు రివీల్ చేయకపోతే, థియేటర్లలోకి వచ్చిన తర్వాతైనా అంశాలపై వివాదాస్పదమౌతుంది. సో.. ఇప్పటికైతే ‘ఆదిపురుష్’లో రావణుడి గెటప్ వివాదాస్పదమవ్వకూడదనే మనందరం కోరుకుందాం.






