
Jagan photo : ఏపీలో తనకు ఇచ్చిన పాసుపుస్తకంపై జగన్ ఫొటో పెట్టడం ఓ రైతు ఆగ్రహానికి కారణమైంది. తన పాత పాసు పుస్తకం ఇయ్యాలని కొత్త పుస్తకాన్ని అధికారుల టేబుల్ పై విసిరిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. కర్నూల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీనిపై సర్వత్రా చర్చ కొనసాగుతున్నది. అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే..
భూమి నాదైతే జగన్ ఫొటో ఎందుకని రైతు పీరా సాహెబ్ ప్రశ్నిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామంలోని 122 సర్వే నంబర్ లో 6 ఎకరాల 62 సెంట్లు ఉండగా, కొత్త పాసు పుస్తకంలో తప్పుల తడకగా ముద్రించారని మండిపడ్డాడు. తన భూమి విషయంలో అధికారులకు ఇంత నిర్లక్ష్యం ఎందుకుని ప్రశ్నించాడు. అక్కడి డిప్యూటీ తహసీల్దార్ పై మండిపడ్డారు.
తహసీల్దార్ ను ఎందుకు కలవనీయడంలేదని ప్రశ్నించారు. పాస్ పుస్తకాన్ని అక్కడే విసిరేసి వెళ్లిపోయాడు. అయినా నా పాసు పుస్తకంపై జగన్ ఫొటో ఎలా పెడుతారని , తన పర్మిషన్ లేకుండా ఇలా ఎలా చేస్తారని మండిపడ్డాడు. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. రైతు అడిగిన ప్రశ్నకు డీటీ సమాధానం చెప్పలేక సైలెంట్ గా ఉండిపోయాడు. తహసీల్దార్ బీజీగా ఉన్నారని చెప్పాడు.