
marriage behind: మనదేశంలో జరిగే శుభకార్యాలకు చదివింపులు చదివించడం ఆనవాయితీ. ఇది పూర్వ కాలం నుంచి వస్తోంది. ఇది పూర్వ కాలం నుంచి వచ్చే ఆచారంగా మనకు కనిపించడం సాధారణమే. తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఈడేతలు అంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కట్నాలు అని మరికొన్ని ప్రాంతాల్లో చదివింపులు అని అంటుంటారు. ఇలా చదివించే కార్యక్రమం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది.
అసలు ఎందుకు ఇలా చేస్తారు? ఇందులో ఉద్దేశం ఏమిటి? దీని పరమార్థం ఏమిటి? అనే దానిపై అందరికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా చదివింపులు చేస్తుంటారు. ఇదంతా దేనికి అని చాలా మందికి అనుమానాలు రావడం సహజమే.
డబ్బులు, వస్తువులో ఇస్తుంటారు. కొందరు డబ్బులు ఇస్తుంటారు. ఇంకా కొందరు బహుమతులు ఇస్తారు. ఈ సంప్రదాయం పూర్వ కాలంనుంచి వస్తోంది. విందు చేసేటప్పుడు ఆడపిల్ల తండ్రికి చేయూతగా ఇచ్చేందుకు బంధువు మనిషికి ఇంత అని వేసుకుని వారికి మద్దతుగా ఇచ్చే వాటిని కట్నాలుగా చెబుతారు.
ఇలా దేశంలో ఎక్కడ ఏ చిన్న శుభకార్యమైనా ఎంతో కొంత నగదు రూపంలో డబ్బులు ఇవ్వడం సంప్రదాయంగా చేసుకున్నారు. అదే ఆచారం తరతరాలుగా వస్తోంది. దీంతో ఆడపిల్ల తండ్రికి సహాయంగా ఇవ్వడమే అని చెబుతున్నారు. ఇలా కట్నాలు ఇచ్చే సంప్రదాయం తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది.