
Sharmila started : ఆంధ్రప్రదేశ్ సీఎం ఇంటి గుట్టు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు ఏపీలో జగన్ ప్రభుత్వం, తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం గురించి చెప్తున్నారు. షర్మిల పార్టీ పెట్టడం అదీ తెలంగాణలో పెట్టడం వెనుక ఏం మతలబు ఉందో వారు విశ్లేషిస్తున్నారు.
సీఎం జగన్ ప్రభుత్వంలో షర్మిల పదవి కోరింది. కానీ జగన్ దానికి అంగీకరించలేదట. దీంతో పార్టీ పెట్టాలని (Sharmila started) అనుకుందట. కోతీ కోతీ కొట్టుకుంటే కుక్క ఎత్తుకపోయినట్లు అన్న చెల్లెలు పదవి కోసం కొట్టుకుంటే మధ్యలో బాబు కూర్చుంటాడని ఇంటి పెద్దలు చెప్పడంతో ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టాలని అనుకుంది షర్మిల. అందుకు తగ్గట్లుగా తండ్రి పేరుతోనే పార్టీని పెట్టింది. వందలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. కానీ ప్రజలకు మాత్రం దగ్గరకాలేకపోయింది. దీంతో సీట్ల మాట దేవుడెరుగు కనీసం డిపాజిట్ ఓట్లయినా దక్కుతాయా అన్న అనుమానాలు పార్టీ నాయకుల్లో కలుగుతుండడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని సలహాలు ఇస్తున్నారట.
అయితే ఈ మధ్య ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని షర్మిల కలిసి మాట్లాడారు. ఈ నేపథ్యంతో తెలంగాణలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీని కాంగ్రెస్ విలీనం చేయాలంటే టీపీసీసీ బాధ్యతలు తనకు అప్పగించాలని కోరినట్లు పలువురు చెప్తున్నారు. కానీ ఇంత ఊపు మీదున్న కాంగ్రెస్ ఇప్పుడు అధ్యక్షుడిని మార్చబోదని తెలుస్తోంది. పైగా తెలంగాణలో షర్మిలకు ఎటువంటి చరిష్మా లేదు. షర్మిలను కాంగ్రెస్ లో కలుపుకుంటే ఆ పార్టీకే కీడని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. షర్మిల ఇక్కడ పాలిటిక్స్ లో ఉండాలని బీఆర్ఎస్ కోరుకుంటుంది. ఎందుకంటే ఓట్లు చల్చడంలో ఎంతో కొంత ఉపయోగం ఉంటుందిని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. ఏది ఏమైనా షర్మిల తెలంగాణలో ఏదో ఒక పార్టీలో తన పార్టీని విలీనం చేయడం ఖాయంగా తెలుస్తోంది.