
Copper Bowl in Pooja Room : మనం వాస్తును నమ్ముతాం. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటాం. ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు పద్ధతిలోనే ఉండాలని కోరుకుంటాం. ఇందుకు అనుగుణంగానే ఇంటిని డిజైన్ చేసుకుంటాం. పూజ చేసే విధానంలో కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉంటుంది. సానుకూలత రావాలంటే ప్రతికూల శక్తులను దూరం చేసుకోవాలి. దానికి చక్కని పరిహారాలు ఉన్నాయి.
ఇంట్లో పూజ చేసే సమయంలో రాగి చెంబులో నిండా నీరు పోసి ఉంచుకోవాలి. దీంతో మనకు వాస్తు దోషాలు ఉంటే పోతాయి. పూజ గదిలో ఉండే రాగి లేదా వెండి చెంబులో పోసిన నీటితో శక్తి దానిలో నిక్షిప్తమై ఉంటుంది. దీని వల్ల ఇంటికి మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీని తీర్థం తీసుకుంటే మంచి జరుగుతుంది. పూజ తరువాత అందరు అందులోని నీటిని తీర్థంగా తీసుకుని ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేందుకు ప్రయత్నించాలి.
పూజ గదిలో ఇలా చెంబులో నీరు ఉంచడంలో కూడా ఇంకో కారణం ఉంది. ఏదైనా పాత్రలో నీరు నిలువ ఉంటే అందులో భగవంతుడు ఉంటాడని నమ్ముతారు. అందుకే చెంబులో నీరు ఉంచుకుని పూజ చేయడం సంప్రదాయం. పూజకు ముందు విగ్రహాలను నీళ్లతో శుభ్రం చేయాలి. పూజ గదిని సంప్రోక్షణ చేసుకోవాలి. ఇలా పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి దేవతలు వస్తారని ప్రతీతి.
పూజ గదిలో కచ్చితంగా ఓ పాత్రలో నీరు ఉంచినప్పుడే పూజ చేయాలి. ఎప్పటికప్పుడు ఆ నీటిని మారుస్తుండాలి. పాత నీరును వాడకూడదు. అలా చేస్తే దేవతలు సంతోషించరు. ఒకవేళ పాత నీరు ఉంటే దాన్ని తులసి చెట్టుకు పోయాలి. మళ్లీ రాగి చెంబు (Copper Bowl) లో కొత్త నీరు తీసుకుని పూజకు ఉపక్రమించడం శ్రేయస్కరం. నీళ్ల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించి దేవుడికి పూజ చేయడం మంచిది.