
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి అతి త్వరలో విశ్వంభర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీపై ఇప్పటికే తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా లెవెల్లో తెగ అంచనాలు పెరిగిపోయాయి. యాక్టింగ్ తో పాటు టాలెంట్ ఉన్నవారికి ఫిలిం ఇండస్ట్రీల కొదవ ఉండదనే దానికి సరైన నిదర్శనం చిరంజీవి.
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆయన స్వశక్తితో మెగాస్టార్ గా ఎదిగారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకొని మెగాస్టార్ గా అగ్ర పీఠాన్ని అలంకరించారు. మెగాస్టార్ పై ఎంత అభిమానం ఉందో చాలా మందికి ఆయనపై నెగటివ్ ఫీలింగ్ కూడా ఉంది. అయితే విశ్వంభర సినిమాని వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ద్వారా చిరంజీవి మరోసారి తన సత్తా చాటాలని అనుకుంటున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తోటే పాటు బాలీవుడ్ తమిళ్ ఇండస్ట్రీలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
భారీ గ్రాఫిక్స్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తాజాగా విడుదల చేసిన టీజర్ ఆకట్టుకోగా ఈ మూవీలో గ్రాఫిక్ డిజైనింగ్ ఇతర పనులు శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండనున్నాయి. అయితే దీనిపై కొంత మంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి సినిమా అంటేనే ఎక్కువ మంది పాజిటివ్ గా కామెంట్ చేయడం అలవాటైతే చాలా తక్కువ మంది నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉంటారు.
విశ్వంభర వరకు ముందు వచ్చిన ఆశ్చర్య మూవీ బోలా శంకర్ మూవీ పెద్దగా రాణించకపోవడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ కావాలని దృఢ సంకల్పంతో చిరంజీవి తీవ్రంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అదే స్థాయిలో ఈ మూవీ హిట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొంతమంది కావాలని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నట్లు అర్థమవుతుంది.