
Rohit Sharma : టీమిండియాలో ప్రస్తుతం సీనియర్ ఆటగాళ్లు విఫలమవుతున్నారు. జూనియర్లు బాగా ఆడుతున్నారు. సీనియర్లు చేతులెత్తేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్తితి అయితే అధ్వానంగా మారింది. తన బ్యాట్ కు పనిచెప్పేందుకు తడబడుతున్నాడు. ఫలితంగా ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. టీమిండియా ఓపెనర్లుగా ఉన్న రోహిత్, రాహుల్ జోడి ప్రశ్నార్థకంగా మారనుంది.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్ లోకి రాకపోతే కెప్టెన్సీ కూడా చేతులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హార్థిక్ పాండ్యాకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే వాదనలు వస్తున్నాయి. గతంలో విరాట్ విఫమైనప్పుడు కూడా ఇదే పరిస్థితి. అతడిని మార్చి రోహిత్ కు పగ్గాలు అప్పగించారు. అప్పుడు సౌరవ్ గంగూలీ చక్రం తింపారు.
వన్డేల్లో, టీ20ల్లో కాకుండా ఐపీఎల్ లో కూడా సరైన ప్రాతినిధ్యం లేదు. అందుకే రోహిత్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంలో పడుతోందని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. రోహిత్ ఆట తీరు మార్చుకోకపోతే ఓపెనర్లు మారిపోతారని చెబుతున్నారు. ఇప్పటికే శుభ్ మన్ గిల్, జైశ్వాల్ సిద్ధంగా ఉన్నారు. వారికి ఓపెనర్లుగా అవకాశం వస్తుందని అంటున్నారు.
రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్ కూడా టీమిండియాకు దూరం కావాల్సి వస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ తన ఫామ్ కొనసాగించకపోతే భవితవ్యం కష్టంగానే ఉంటుంది. కెప్టెన్సీ నుంచి దూరం కావాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇదే నిజమైతే రోహిత్ బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది. ఈ ముప్పును తప్పించుకోవాలంటే రోహిత్ బ్యాట్ ఝుళిపించి తన సత్తా చాటాల్సిన అవసరం ఏర్పడింది