జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కాపు కులస్తులు కోరుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించే అవకాశాలేవని పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. అయితే టిడిపితో గాని బిజెపితో గాని పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడొచ్చని పలువురు జనసేన నాయకులు భావిస్తున్నారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి తో భేటీ అవడం, మరోపక్క చంద్రబాబు నాయుడుతో భేటీ అవడంతో ఎవరితో లాభం.. ఎవరితో నష్టం అని కాపులు సందిగ్ధంలో పడిపోయారు. టిడిపి తో పొత్తు పెట్టుకుంటే 50 శాతం సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలని అందులో ని ముఖ్య నాయకుడు పేర్కొనడం గమనార్హం. మరోపక్క టిడిపి సీనియర్ నాయకులు 50 శాతం సీట్లు జనసేనకు ఇవ్వడం సాధ్యం కాదని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. దీంతో జనసేన లో ఉన్న కాపులు అయోమయానికి గురవుతున్నారు.
టిడిపితో పొత్తు పెట్టుకుంటే జనసేనకు చాలా నష్టమని రాజకీయ విశ్లేషకులు,పార్టీ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. జనసేన ను నమ్ముకొని ఉన్న కాపులు ఆశపడుతున్నట్టుగా 50 శాతం సీట్లు గాని, గౌరవప్రదమైన పదవులు, కొంత పవర్ గాని టిడిపితో పొత్తు పెట్టుకుంటే ఉండవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేపీతో కొంత బెటర్..
రాబోయే ఎన్నికల్లో జనసేన బీజేపీ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే కొంత బెటర్ గానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బిజెపి తో కలసి పోటీ చేస్తే 25 నుండి 40 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు. అయితే తాము ఆశించిన పదవులు, కొంత మేరకు వస్తాయని, అలాగే గౌరవం కూడా ఉంటుందని డమినేషన్ కూడా పవన్ కళ్యాణ్ దే ఉంటుందని ముఖ్య నాయకులు వాపోతున్నారు.
ఒంటరిగా పోటీ చేస్తేనే సీఎంకు చాన్స్..
రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 25 సీట్లు వస్తాయని పార్టీ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. టిడిపి బిజెపికి సీఎం కావడానికి సంపూర్ణ మెజారిటీ రాదని టిడిపి, వైసిపి ఎప్పుడూ ఒక్కటి కావని..అప్పుడు ఎవరో ఒకరు జనసేనకు మద్దత్తు ఇస్తారని అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంటుందని కాపులు భావిస్తున్నారు.
జనసేన రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడమే మేలని అప్పుడే తగిన గౌరవం సమాన అవకాశాలు ఉంటాయని జనసేన పార్టీ ముఖ్య నాయకులు వాపోతున్నారు. లేకపోతే పార్టీ మరుగున పడే అవకాశం ఉంటుందని తెగేసి చెప్పేస్తున్నారు.ఏది ఏమైనా జనసేన పార్టీ టిడిపి,బిజెపి ఇచ్చే ఆఫర్లకు లొంగి పొత్తులకు సై అంటుందా.. లేక ఒంటరిగానే బరిలోకి దిగుతుందా వేచి చూడాల్సినందే..!