
Will JDS accept BJP offer : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసేలా కనిపిస్తుంది. ఇప్పటి వరకూ (11 గంటలు) దాదాపు 121 సీట్లు ఆధిక్యంలో ఉంది ఆ పార్టీ. బీజేపీ మాత్రం కొంచెం వెనుకబడే ఉన్నట్లు కనిపిస్తుంది. 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ దాటేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని మొదటి నుంచి తెలిసిందే. ప్రతీ ఎన్నికల్లో కన్నడిగులు ప్రభుత్వాన్ని మార్చడం పరిపాటే..
ప్రస్తుతం కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మరో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ నిలవనుండగా, జేడీఎస్ కూడా 27 సిట్లతో కొనసాగుతుంది. ఒక వేళ ఓటమి పాలైతే బీజేపీ మరో ప్లాన్ అమలు చేస్తుందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. గతంలో జేడీఎస్ బీజేపీలో మిత్రపక్షంగా కొనసాగింది. ఈ సారి మ్యాజిక్ ఫిగర్ కు అటు ఇటు అయితే జేడీఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం ఇప్పటి వరకే జేడీఎస్ అధినేత కుమార స్వామితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్(113)ను దాటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ పార్టీలో జేడీఎస్ చేరినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పూర్తి మెజార్టి సాధించిన తర్వాత ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఎవరూ అనుకోరు. కానీ ఒక వేళ జేడీఎస్ కలిసి వస్తుంటే మాత్రం కాదనలేకపోతారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వంలో ఎలాంటి ముఖ్యమైన పోస్టులు ఇవ్వకపోవచ్చు. దీంతో జేడీఎస్ కాంగ్రెస్ లో ఉన్నా ఆదరణ ఉండదు. కనీసం ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు దగ్గరగా నైనా ఉంటారని అనుకుంటున్నాట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బీజేపీ వైపు జేడీఎస్ వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంది.