
Gangula Kamalakar : ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్. ఇక్కడ చాలా మంది నేతలు ఉద్యమాలను భుజాన ఎక్కుకున్న వారేనంటే సందేహం లేదు. గతంలో కూడా కేసీఆర్ ఈ పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ గంగుల కమలాకర్ మాత్రం అలా కాదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన టీడీపీలో ఉన్నారు. చివరి క్షణంలో ఆయనకు టికెట్ ఇచ్చి బరిలోకి దించారు కేసీఆర్ కానీ ఆయనను ఢీ కొట్టే ప్రత్యర్థి లేకపోవడంతో ఆయన గెలుపు అప్పుడు నల్లేరుపై నడక అంటూ సాగింది. కానీ ఇప్పుడు అలా కాదని లీకులు వినిపిస్తున్నాయి. అసలు కరీంనగర్ లో ఈ ఏడాది చివరలో గంగుల గెలుస్తారా..? ఇక్కడ తెలుసుకుందాం.
గంగుల కమలాకర్ కు కరీంగనర్ పై మంచి పట్టు ఉంది. ఆయన నాయకత్వాన్ని ఇప్పటికి అసెంబ్లీ పరిధిలోని ప్రజలు ఆహ్వానిస్తూ వస్తున్నారు. కానీ ఈ సారి ఆయన గెలుపు కష్టంగా మారుతుందని తెలుస్తోంది. గంగులకు వైరి పక్షంతో కాకుండా మిత్ర పక్షంతో ముపుు ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఎంఐఎం ఇప్పుడు గంగులను టార్గెట్ చేస్తుంది. గంగుల మద్దతుదారులతో ఎంఐఎం నాయకులు సోషల్ మీడియా వేధికగా అస్త్రాలు సంధిస్తున్నారు. కేసీఆర్ కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు గుంగుల కమలాకర్. ఆయన కోటరీతోనే ఆయన ఇప్పుడు ఢీకొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలు మెజారిటీ రోల్ పోషించనున్నారు. మైనార్టీలు ఓటు వేస్తే ఎంఐఎం ఒక వేళ ఆ పార్టీ నుంచి అభ్యర్థి లేకుంటే మాత్రమే మిత్రపక్షానికి ఓటేస్తారు. ఇక ఆయన కూడా నచ్చకపోతే వారు కాంగ్రెస్ వైపు వెళ్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటు వేయరు. గత రెండు పర్యాయాలు ఆయన ఇలానే విజయం సాధించారు. ఇన్నాళ్లూ ఇది గంగులకు కలిసి వచ్చిన అంశమే.
కానీ ఇప్పుడు సమీకరణలు మారుతున్నట్లు తెలుస్తోంది. మజ్లిస్ నాయకులు గంగులపై గర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా ఆయన తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ మద్దతుతోనే గెలిచి ఇప్పుడు తమనే పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యలో సోషల్ మీడియా వార్ కూడా బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎంగా మారింది. మంత్రి కావాలనే మజ్లిస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నాడని ఎంఐఎం ఆరోపిస్తూ వస్తోంది. అయితే ఈ మధ్య సమావేశం నిర్వహించిన మజ్లిస్ నేతలు ఎంత ఖర్చు అయినా సరే ఈ సారి కరీంనగర్ గడ్డపై ఎంఐఎం జెండా ఎగువేయాలని తీర్మానించుకున్నారట. దాదాపు కరీంనగర్ లోని 35 డివిజన్లలో ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ప్రభావిత శక్తిగా మారింది. ఎంఐఎంను గెలిపించుకోవాలని ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడైన సయ్యద్ గులాం హుస్సేన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో కరీంనగర్ రాజకీయాల్లో తీవ్ర మార్పు కనిపించవచ్చని టాక్ వినిపిస్తోంది.
కరీంనగర్ కేంద్రంగా జరిగిన ‘ఈద్ మిలాప్’ పార్టీలో మాట్లాడిన నేతలు.. గులాబీ బాస్ పైనా, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పైనా సాఫ్ట్ కార్నర్ ను బయటపెట్టారే తప్ప.. ఎమ్మె్ల్యే గంగులపై ఒక్కమాట కూడా మాట్లాడలేదు. పైగా ఎంఐఎంను సారి గెలిపించుకుంటామని చెప్పడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. కరీంనగర్ స్మార్ట్ సిటీగా రూపొందడానికి వినోద్ కుమారే కారణం అంటూ చెప్పుకచ్చారు ముస్లిం నేతలు. తమ మద్దతుతోనే గెలిచిన గంగుల తమపైనే వార్ చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చోమని చెప్తున్నారు. దమ్ముంటే ఎంఐఎం అండ లేకుండా గెలిచి చూపించాలని సవాల్ విసురుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని పట్టే ఎంఐఎం నిర్ణయం..
కరీంనగర్ లో రాజకీయ వాతావరణం చూస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కరీంనగర్ గడ్డపై తమజెండా ఎగరేయాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో కూడా ఈ సారి మార్పులు ఉండనున్నాయి. గంగులను ఎంపీ స్థానానికి పంపి.. ఆ స్థానంలో వినోద్ కుమార్ ను తీసుకచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వినోద్ మాత్రం ఎంపీ స్థానంపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. వినోద్ తప్పుకుంటే ఆ స్థానంలో మళ్లీ గంగుల పోటీ చేస్తే ఎంఐఎం నుంచి అభ్యర్థిని దించడం ఖాయంగా కనిపిస్తోంది. చివరగా బీఆర్ఎస్ బరిలోకి దింపే అభ్యర్థిని బట్టే ఎంఐఎం నిర్ణయం ఆధారపడి ఉందనే టాక్ వినిపిస్తోంది.