Prashant Kishor : ప్రశాంత్ కిశోర్(పీకే) సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. జగన్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని విశ్లేషిం చా రు. ఉచితాలపైన జగన్ ఆధాపడటంతో ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ఓటమితో పోల్యారు. ఇక్కడే అసలు పీకే విశ్లేషణతో పలువురు విభేదిస్తున్నారు. ఏపీలో గ్రౌండ్ రియాల్టీ గురించి వివరిస్తున్నారు. దీంతో పాటుగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పీకే అంచనాలు.. వాస్తవాలు ఇప్పుడు చర్చలోకి వచ్చాయి.
పీకే సంచలనం : ప్రశాంత్ కిశోర్ 2019 ఎన్నికల్లో జగన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పు డు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల తరువాత తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయనని ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. బీహార్ లో సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర నిర్వహించారు. కానీ, ఆశించిన స్థాయిలో అక్కడ పీకేకు మద్దతు రాలేదు.
ఇతర రాష్ట్రాల్లో పార్టీలను గెలిపించిన పీకే సొంత రాష్ట్రంలో సొంత పార్టీకి గుర్తింపు తెచ్చుకోవటంలో విఫలమయ్యారు. తెలంగాణలో కొద్ది రోజులు కేసీఆర్ కు అనుకూలంగా పని చేసారు. చంద్రబా బు అరెస్ట్ తరువాత ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు, సలహాల కోసం టీడీపీ ప్రయత్నాలు చేసింది. చంద్రబాబు, తనకు ఒక కామన్ ఫ్రెండ్ ఒత్తిడి మేరకు తాను చంద్రబాబును కలవాల్సి వచ్చిందని గతంలో పీకే చెప్పుకొచ్చారు.
వైసీపీ వాదన ఇలా :
కొద్ది రోజుల క్రితం ఉండవల్లిలో.. తాజాగా హైదరాబాద్ లో చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ సమావే శాలు నిర్వహించారు. అభ్యర్దులు, ప్రచారం, వ్యూహాల పై సూచనలు చేసినట్లు సమా చారం. ఇక, ఇప్పుడు ఏపీలో ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారని.. ఉచిత పథకాలకు కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదేచేసి దెబ్బతిన్నారని తెలిపారు. ఇక్కడే పీకే వ్యాఖ్యలతో వైసీపీ విభేదిస్తోంది.