
SRH beat RCB : ఐపీఎల్ 2023 తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్లో కీలక మ్యాచ్ జరగబోతున్నది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గురువారం బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో తలపడనుంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో చివరి రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఇక ప్లే ఆఫ్ రేసులో లేనట్లే.. అయితే ఆర్సీబీ కి మాత్రం ఛాన్స్ ఉంది. అయితే సన్ రైటర్స్ మ్యాచ్ జరుతున్నంత సేపు మాత్రం జట్టు ఓనర్ మీదే ట్రోల్స్ కొనసాగుతున్నాయి. కావ్య మారన్ ఫొటోలతో ఈ ట్రోల్స్ కొనసాగిస్తున్నారు.
గతంలో ఆఖరి మ్యాచుల్లో తలపడిన ఈ రెండు జట్ల పరిస్థతి చూసుకుంటే..
- 2022లో ఆర్సీబీ 68పరుగులకే ఆర్సీబీ పై ఆలౌట్ అయ్యింది.
- 2021లో ఆర్సీబీని నాలుగు పరుగులతో ఓడించిన ఎస్ఆర్ హెచ్, పాయింట్ల పట్టికలో ఆ జట్టును రెండో స్థానం నుంచి కిందకు దించింది.
- 2020లో ఆర్సీబీని ఓడించి సీజన్ నుంచే వైదోలిగేలా చేసింది..
- 2016లో కూడా పోటాపోటీ ఫైనల్ గేమ్ లో ఆర్సీబీని ఎస్ఆర్ హెచ్ ఓడించింది.
- 2015లో ఎస్ఆర్ హెచ్ తన చివరిలీగ్ మ్యాచ్ లో ముంబైపై ఓడిపోయి రాయల్ చాలెంజర్స్ కు టాప్ 2 స్థానం దక్కకుండా చేసింది.
- 2013 లో ఎస్ఆర్ హెచ్ తన చివరి లీగ్ మ్యాచ్ గెలిచి నాలుగో స్థానానికి వెళ్లింది. దీంతో ఆర్సీబీకి ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి.
- 2012లో ఆర్సీబీ తన మ్యాచ్ డెక్కన్ పై ఓడిపోయి నాలుగో స్థానాన్ని వదులుకుంది. స్వల్ప రన్ రేట్తో చెన్నై సూపర్ కింగ్స్ ఈ స్థానాన్ని దక్కించుకుంది.
- 2009లో డెక్కన్ ఆర్సీబీని ఫైనల్లో ఓడించింది.