England Test Cricket ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బజ్ బాల్ ఆటతో టెస్టులను కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. కానీ అతని కెప్టెన్సీని పొగిడిన వాళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారు.
స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇండియా, ఐర్లాండ్ తో పాటు విదేశాల్లో పాకిస్తాన్, కివీస్ లపై ఇదే ఫార్ములాను పాటించి ఫలితాలు రాబట్టింది. ఇందులో భాగంగా యాషెస్ లో కూడా ఇదే వ్యూహాన్ని స్టోక్స్.. యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ప్రయోగించాడు. కాకీన ఆస్ర్టేలియాతో ఈ బజ్ బాల్ విధానం వర్కౌట్ కాకపోవచ్చని మొదటి నుంచి వ్యక్తమవుతున్నది. యాషెష్ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి అని చెప్పాలి. పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టుకు మొదటి రెండు మ్యాచులలో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది.
ఎందుకంటే బజ్ బాల్ అనే కొత్త పద్ధతి ద్వారా ఆస్ట్రేలియను బోల్తా కొట్టించాలని అనుకుంది ఇంగ్లాండ్. కానీ ఊహించని రీతిలో ఆస్ట్రేలియా జోరు ముందు ఇంగ్లాండ్ తట్టుకుని నిలబడలేకపోయింది. అప్పటికే డబ్ల్యూటీసి ఫైనల్లో గెలిచి విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. ఇక యాషెష్ సిరీస్ లోను అదే జోరును కొనసాగిస్తున్నది. మరో మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావించింది ఆస్ట్రేలియా. ఇక వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి నిరాశపరచిన ఇంగ్లాండు జట్టు మూడో మ్యాచ్లో మాత్రం పట్టు బిగించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించింది. అదే సమయంలో బ్యాట్స్మెన్లు కూడా వీర విహారం చేశారు.
యాషెస్ సిరీస్ తొలి టెస్టు మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో రెండు వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. అయితే తొలి రోజే డిక్లేర్ చేయడం, రెండు ఇన్నింగ్స్ లలోనూ ‘బజ్ బాల్’ గేమ్ పేరుతో దూకుడుగా ఆడటం వల్లే ఇంగ్లండ్ ఓడిందనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దీనిపై వెనుకడుగు వేసే అవకాశం లేదని మరోసారి స్పష్టం చేశాడు. తమ జట్టు అవలంబిస్తున్న దూకుడైన ఆటతీరును కొనసాగిస్తామని వెల్లడిస్తున్నాడు. తాము అనుకున్న ఆటతీరును (బజ్‌బాల్ క్రికెట్) మున్ముందు కూడా ప్రదర్శిస్తామని, అదే దూకుడును కొనసాగిస్తామని చెబుతున్నాడు.
సుదీర్ఘమైన టెస్టు ఫార్మాట్లో ఆటగాళ్లు ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా పరుగులు చేస్తూ ఉంటారు. స్ట్రైక్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ బజ్ బాల్ అంటే మాత్రం ప్రత్యర్థులకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఎటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోవడమే. న్యూజిలాండ్ పై టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ జట్టు ఇదే వ్యూహాన్ని ఆచరణలో పెట్టింది. న్యూజిలాండ్ నిర్దేశించిన టార్గెట్ ను బెన్ స్టోక్స్, మెకల్లమ్ ఆధ్వర్యంలోనే ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ విధానంలో ఎంతో అవలీలగా ఛేదించింది అని చెప్పాలి. ఇటీవల ఇండియా తో జరిగిన రీషెడ్యూల్ టెస్టుల్లో కూడా ఇలాంటి వ్యూహాన్ని ఫాలో అయింది అని చెప్పాలి. కానీ బలమైన జట్లతో తలపడినప్పడు మాత్రం ఈ ఆట తీరు వర్కౌట్ కాకపోవచ్చు. కానీ బెన్ స్టోక్ మాత్రం తమ ఆటతీరును మార్చుకోమని స్పష్టం చేయడం అతని ధీమా ఏమిటో అర్థమవుతున్నది.
ఏడాది క్రితం వరకు ఇంగ్లండ్‌ను వరుస పరాజయాలు వేధించాయి. యాషెస్ సిరీస్‌ను 4-0 తేడాతో కోల్పోవడం, ఆపై వెస్టిండీస్ టూర్‌లోనూ ఓటమి పాలవ్వడంతో జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు టెస్టు పగ్గాలు అప్పగించారు. ఆనాటి నుంచి ఇంగ్లండ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది.
ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగడమే ఇంగ్లండ్ బ్యాటర్ల పని. ఓవకు మూడు నుంచి నాలుగేసి బౌండరీలు బాదుతూ టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తారు. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లు ఒత్తిడిలోకి జారుకుంటారు. అదే వారిని విజయాల బాట పట్టించింది. గతేడాది చివరలో పాకిస్థాన్ లో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టు.. వారికీ ఈ రుచి చూపించింది. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు.. సెంచరీలు, డబులు సెంచరీలు చేస్తూ పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు.
ReplyForward
|