Chandrayaan-3 భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో చేపడుతున్న చంద్రయాన్ 3 కొద్ది సేపట్లో కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ఇది ప్రయోగించనుంది. చంద్రయాన్ ప్రయోగానికి అంతా సిద్ధం చేశారు. కౌంట్ డౌన్ చేయనున్నారు. దీంతో చంద్రయాన్ 3 ప్రయోగానికి శ్రీహరి కోట వేదిక కానుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు తిరుమలను దర్శించుకుని చంద్రయాన్ 3 విజయవంతం కావాలని దేవుడిని వేడుకుంటున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధింి సూక్ష్మ నమూనాను వాస్త్రవేత్తలు పూజలు చేశారు.
నేడు మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్ -3 ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది. 24 గంటల తరువాత సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించనున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో షార్ అడవుల్లో సీఐఎస్ ఎఫ్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీహరి కోట మార్గంలో మొదటి రెండు గంటల్లో మొదటి గేటు వద్ద కేంద్ర భద్రత బలగాలు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నారు.
చంద్రుడి ఉపతలంపై కాలు మోపడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలు విఫలం అయ్యాయి. దీంతో ఈ సారి అయినా అక్కడ పటిష్టంగా కాలు మోపి చూపాలని శాస్త్రవేత్తలు తెగ ప్రయత్నిస్తున్నారు. తొలిసారిగా 2019లో చంద్రయాన్ 2 ప్రయోగించినా అది విఫలం అయింది. దీంతో ఇప్పుడు కచ్చితంగా చంద్రుడిపై కాలు మోపాలనే కృతనిశ్చయంతో ఉంది.
చంద్రయాన్ 3 ప్రయోగం కచ్చితంగా విజయవంతం అయి తీరుతుందని అంచనా వేస్తున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావాలని ఆశిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ కౌంట్ డౌన్ మొదలైతే రేపు మధ్యాహ్నం వరకు పూర్తవుతుంది. ఇక ప్రయోగించడమే తరువాయి అని చెబుతున్నారు. చంద్రయాన్ విజయవంతం కావాలని అందరు ఆశిస్తున్నారు.