Pa Pa Da Da : తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో రీమేక్ చేసినా అంతగా ఫలితం కనిపించడం లేదు. ఇటీవల రిలీజ్ అయిన మూవీ ‘బ్రో: ది అవతార్’. ఈ సినిమా తమిళంలో ‘వినోదయా సీతం’ రీమేక్. భారీ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీలో హీరోగా చేశాడు. అయినా కూడా ఇది ఆయనకు కలిసి రాలేదు. అంత పెద్ద స్టార్.. పైగా రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న తమిళ ‘దాదా’ డబ్బింగ్ ‘పా.. పా..’గా థియేటర్ లో రిలీజ్ కాబోతోంది. అది ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘డా డా’ తెలుగు డబ్బింగ్ తెలుగు సినీ ప్రియుల్లో బజ్ క్రియేట్ చేస్తోంది. ‘పా.. పా..’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
ఒరిజినల్ తమిళ వెర్షన్ యూత్ ఫుల్, లవ్ ఫుల్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఈ తమిళ ‘దాదా’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తెలుగు టీమ్ ఇటీవల విడుదల చేసింది. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్రబృందం భావిస్తోంది.
కవిన్, అపర దాస్, మోనికా చిన్నకోట్ల, భాగ్యరాజా, ఐశ్వర్య, గణేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. యూత్ ఫుల్ రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా మేళవింపుతో తెరకెక్కిన ‘పా.. పా..’ తమిళ తరహాలోనే తెలుగు సినీ ప్రేక్షకులను అలరించనుంది.