
Music director : ఓడలు బళ్లవుతాయి. బళ్లు ఓడలవుతాయి. దశ తిరిగితే ఎక్కడికో వెళ్లిపోతాం. దశ మారిందంటే దిగజారిపోతాం. ఒకనాడు కష్టాల్లో ఉంటాం. కొన్నాళ్లకు ఆస్తిపరులం అవుతాం. తలరాత మారితే మన విధిరాత మారుతుంది. బతుకే బస్టాండ్ అవుతుంది. అప్పులు పెరిగితే ఐపీ పెట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఎడాపెడా అప్పులు చేశాడు. ఇప్పుడు అధ్వాన స్థితికి చేరుకున్నాడు. ఐపీ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
కుక్క పని కుక్క చేయాలి. గాడిద పని గాడిద చేయాలి. కుక్క పని గాడిద గాడిద పని కుక్క చేస్తే పరిస్థితిలో తేడా వస్తుంది. ఇక్కడ ఆ సంగీత దర్శకుడు చేసింది అదే. మంచి ఫామ్ లో ఉండగా సంగీతం ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి ఓ మూడు థియేటర్లు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఇంకా మూడు సినిమాలు నిర్మాణం చేయాలని భావించాడు. దీని కోసం అప్పులు చేశాడు.
దీంతో అప్పుల భారం రూ. 12 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే ఐపీ పెడతారని భావిస్తున్నారు. ఇలా అనుకోని విధంగా నష్టాల్లో కూరుకుపోవడంతో అతడి భవితవ్యం గందరగోళంలో పడింది. గతంలో దాదాపు 70-80 సినిమాలు చేసిన అతడు ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు.
చేసే పని సరిగా చేయకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. తనకు వచ్చిన పని చేయకుండా ఇతర వాటిపై మనసు పారేసుకోవడం సరికాదు. ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న అతడి పరిస్థితి ఇప్పుడు ఇంత దయనీయంగా మారపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉన్నదాంట్లోనే సర్దుకోవాలి. లేనిదాని కోసం పరుగులు పెడితే ఇలాగే ఉంటుందని పలువురు చెబుతున్నారు.