21.6 C
India
Wednesday, February 11, 2026
More

    TDP sketch : టీడీపీ స్కెచ్ సక్సెస్ అయ్యేనా? 

    Date:

    TDP sketch
    TDP sketch

    TDP sketch : టీడీపీ అధికారంలో వస్తే సంక్షే పథకాలను నిలపివేస్తారని వైసీపీ  చేసిన ప్రచారానికి మినీ మేనిఫెస్టోతో చెక్ పడింది. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మరో స్కెచ్ వేశారని తెలుస్తున్నది. చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని వైసీపీ చేస్తున్న ఆరోపణలకు తిప్పి కొట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

    జగన్ ఇవ్వగా లేనిది సంపద సృష్టి చేసే చంద్రబాబు ఎందుకు ఇవ్వలేరని టీడీపీ నాయకులు  కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తున్నది.  లబ్ధిదారులను ముందుగానే ఎంపిక చేసి వారికి కార్డులు పంచబోతున్నట్లు సమాచారం. అడ్డగోలు హామీలు ఇచ్చిన  వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చాక అర్హుల పేరిట భారీగా కోతలు వేస్తూ వస్తున్నారు. నియోజకవర్గానికి వెయ్యి మందికి మించకుండా లబ్దిదారులతో పథకాలు లాగేస్తున్నారు..

     ఆఖరుకు  విదేశీ విద్యా దీవెన, బడుగు, బలహీనవర్గాల పెళ్లిళ్లకు ఇచ్చే సాయానికి కూడా ఊహించని కండీషన్లు పెట్టారు. దీనినే టీడీపీ పావుగా ఉపయోగించబోతున్నది. అర్హుల పేరిట కోతలు విధించకుండా ప్రజల్లో నమ్మకం కల్పించేంకు ముందుగానే లబ్దిదారులను ఎంపిక చేసి అర్హత కార్డులు ఇవ్వాలని భావిస్తున్నది.  ఆ కార్డులు అందుకున్న వారందరికీ  తమకు ప్రభుత్వ పథకాలు ఎలాగూ వస్తాయన్న నమ్మకంతో ఓట్లు వేస్తారని టీడీపీ అధినేత భావిస్తున్నారు.

    నగదు బదిలీ అనే అంశాన్ని ముందు తీసుకు వచ్చిందే టీడీపీ. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఈ హామీలను ఇచ్చింది. నారా లోకేశ్ ఈ మేనిఫెస్టో తయారీలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో యాక్టివ్ కాకపోయినప్పటికీ ఆయన చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. టీడీపీ అధికారంలోకి వస్తే.. నగదు బదిలీ చేస్తామని కుప్పంలో ఇలా లబ్దిదారులకు కార్డుల్ని కూడా పంచారు. కానీ ఆ నగదు బదిలీ హామీలకు టైమింగ్ మిస్సయింది. ఈ సారి మాత్రం టీడీపీ పకడ్బందీ ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తున్నది. మెజార్టీ ఓటర్లకు.. లబ్దిదారులకు కార్డులు పంపిణీ చేసి అధికారంలోకి రావాలని వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Chebrolu Kiran : జగన్ ఫ్యామిలీపై కామెంట్స్.. చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేయాలని టీడీపీ ఆదేశాలు

    Chebrolu Kiran : వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...