33.4 C
India
Wednesday, May 21, 2025
More

    End of World : 14 ఏళ్లలో ప్రపంచం అంతం కాబోతుందా? భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం?

    Date:

    End of World
    End of World

    End of World : మరో 14 ఏళ్లలో ప్రమాదకరమైన గ్రహశకలం భూమిని ఢీకొట్టవచ్చు. ఈ మేరకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ భారీ గ్రహశకలం ఢీకొట్టేందుకు  72 శాతం అవకాశాలు ఉన్నట్లు  నివేదికలో పేర్కొంది. సమీప భవిష్యత్తులో అలాంటి గ్రహశకలం ఏదీ గుర్తించబడనప్పటికీ, ఇది 14 సంవత్సరాలలో జరుగుతుందని భావిస్తున్నారు.  ఇది ఏప్రిల్‌లో ఐదో ప్లానెటరీ డిఫెన్స్ ఇంటరాజెన్సీ టాబ్లెట్‌టాప్ ప్రాక్టీస్‌ను నిర్వహించింది. జూన్ 20న  జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ (APL)లో జరిగిన ఈ రిహార్సల్ గురించి నాసా తెలియజేసింది. ఈ టాబ్లెట్‌టాప్ ప్రాక్టీస్‌ను నిర్వహించినప్పుడు నాసా కాకుండా, వివిధ అమెరికా ప్రభుత్వ సంస్థలు, అంతర్జాతీయ స్థాయి నుంచి మొత్తం 100 మంది నిపుణులు పాల్గొన్నారు.

    టాబ్లెట్‌టాప్ ప్రాక్టీస్‌ చేసే సమయంలో ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించారు. దీనిలో మునుపెన్నడూ గుర్తించని స్టెరాయిడ్ గుర్తించారు. దీనికి సంబంధించి రూపొందించిన ప్రాథమిక లెక్కల ప్రకారం.. ఇది జూలై 12, 2038న దాదాపు 14 ఏళ్లలోపు ఢీకొంటుంది. అయితే, ఇది ఎంత పెద్దదో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అటువంటి ముప్పును ఎదుర్కొనే భూమి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ మొత్తం కసరత్తు చేసినట్లు కూడా నివేదిక చెబుతోంది. వాషింగ్టన్‌లోని నాసా హెడ్ ఆఫీస్‌లోని ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లీ జాన్సన్ మాట్లాడుతూ.. ఒక పెద్ద శకలం బహుశా మానవుల సాంకేతికతను అధిగమించి  భారీ  ప్రకృతి వైపరీత్యం కలుగజేయవచ్చు. కాబట్టి మానవులు దానిని నిరోధించడానికి సాంకేతిక మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. NASA DART (డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్) మిషన్ నుంచి డేటాను ఉపయోగించడం ఈ రకమైన మొదటి ప్రాక్టీస్ కావడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sunitha Williams : నింగి నుంచి నేలకు.. క్షేమంగా ల్యాండ్‌ అయిన సునీత విలియమ్స్‌..

    Sunitha Williams : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మరియు...

    Sunita and Wilmore : అంతరిక్షంలో ఉన్నందుకు సునీత, విల్మోర్ కు వచ్చే జీతభత్యాలు ఎంతంటే?

    Sunita and Wilmore : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల...

    Sunita Williams : కొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్

    Sunita Williams : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్...

    Mars : మార్స్ నుంచి మన ఎర్త్ ఎలా కనిపిస్తుందంటే?

    Mars : సౌర కుటుంబం (Solar System) గురించి మనం చిన్నతనం...