29.6 C
India
Sunday, April 20, 2025
More

    Telangana BJP : తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు ఉంటాయా..?

    Date:

    Telangana BJP
    Telangana BJP

    Major changes in Telangana BJP : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో భారీ మార్పులు ఉంటాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల కోడ్ ఇంకో 5 నెలల్లో రానుంది. అప్పటి వరకూ బీజేపీని సమూలంగా మార్చడం సాధ్యం కాదు. అయితే ఉన్న వారితోనే స్ట్రాటజీ ఉపయోగించి రాష్ట్రంను కమలంలో కలుపుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ వ్యతిరేఖ ఓట్లను తమ ఖాతాలో వేసుకుంటే చాలు అత్యధిక మెజారిటీని దక్కించుకోగలుగుతామని అనుకుంటున్నారు బీజేపీ నాయకులు. కానీ కర్ణాటక ఫలితాలు కొంత ఇబ్బంది పెట్టడం మాట వాస్తవమేనని కానీ, అక్కడి పరిస్థితులకు ఇక్కడి పరిస్థితులకు తేడా స్పష్టంగా కనిపిస్తుందని అనుకుంటున్నారు. అయితే కర్ణాటక ఫలితాలతో ఊపు మీదున్న కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

    బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంబయ్ ఏకపక్ష నిర్ణయాలు, దూకుడు పార్టీకి కొంచెం చేటు చేసే ప్రమాదం ఉందని ఇక్కడి నాయకులు భావిస్తున్నారు. పార్టీ పటిష్టత, చేరికలు, గెలుపుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఉండి పార్టీ కార్యాచరణపై విచారించనున్నారు. బండి సంజయ్ దూకుడుగా ఉన్నా. ఆయన వల్లే తెలంగాణలో బీజేపీకి పట్టు దొరికిందని, ఆయననే ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకూ కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ స్టేట్ చీఫ్ పదవి కోసం ఈటల కూడా గట్టిగా ప్రయత్రిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వస్తే, పార్టీలో చీలికలు ఉంటాయా..? అనే కోణంలో ఆలోచిస్తుంది అధినాయకత్వం. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు ఈటల రాజేందర్. కానీ చాలా మంది సీనియర్ నాయకులు పార్టీని నమ్ముకొని ఏళ్లుగా కష్టపడుతున్నారు. ఇప్పడు పదవి ఈటలకు ఇస్తే చీలికలు ఏర్పడవచ్చని అనుకుంటున్నారు.

    ఈ అసెంబ్లీ ఎన్నికల వరకూ దాదాపు అధ్యక్షడు మారకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బండి సంజయ్ చురుకైన నాయకుడు. ఆయన హయాంలోనే తెలంగాణలో పార్టీ గతంలో కంటే వేగంగా పుంజుకుంది. హిందుత్వ ఎంజెండాను ముందుకు తీసుకుపోవడంతో ఆయన సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాదాపు 40 మంది వరకూ కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. బండి నాయకత్వంపై చాలా మంది గుర్రుగా ఉన్నా.. పార్టీ ఆదేశాల మేరకు కలిసి పని చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Bigg Boss : ఏడాది ‘బిగ్ బాస్’ షో లేనట్టేనా..? నిరాశలో ఫ్యాన్స్..కారణం ఏంటంటే!

    Bigg Boss : ప్రతీ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే హిందీ బిగ్...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...

    JEE Main : జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల: 24 మందికి 100 పర్సంటైల్

    JEE Main : జేఈఈ (మెయిన్) 2025 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి...

    Infosys : ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ : 20వేల కొత్త నియామకాలు..!

    Infosys Jobs : దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 2026 ఆర్థిక సంవత్సరంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandi Sanjay: టీటీడీకి, వక్ఫ్ బోర్డుకు తేడా తెలియని ఒవైసీ: బండి సంజయ్

    వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడమేంటని మజ్లిస్ అధినేత...

    Bandi Sanjay : పోలీసుల అదుపులో బండి సంజయ్.. చలో సచివాలయం ర్యాలీ ఉద్రిక్తం

    Bandi Sanjay : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు...

    Bandi Sanjay : హిందూ ధర్మంపై భారీ కుట్ర.. కఠిన చర్యలు తీసుకోండి: ఏపీ సీఎంకు బండి సంజయ్ లేఖ

    Bandi Sanjay : హిందూ ధర్మంపై భారీ కుట్ర జరుగుతోందని, తిరుమల...

    Jamili Election : జమిలి ఎన్నికలతో బీఆర్ఎస్ కు చెక్ పెట్టనున్న బీజేపీ

    Jamili Election : ఇటీవల కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికలకు గ్రీన్...