Tillu Square :
డీజే టిల్లుతో సంచలన విజయం అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ తదుపరి చిత్రం చేస్తున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో చిన్న సినిమాలు పెద్ద హిట్ సాధించడం మామూలే. తరువాత టిల్లు స్వ్కేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డీజే టిల్లుతో సంచలనం కలిగించాడు. తాజాగా ఈ చిత్రంలో టికెట్ ఏ కొనకుండా అంటూ సాగే పాటను చిత్రీకరిస్తున్నారు.
పాటను కాసర్ల శ్యామ్ రచించిన రామ్ మిరియాల పాడి స్వయంగా సంగీతం సమకూర్చారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ప్రత్యేకమైన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. డీజే టిల్లు తో తన సహజత్వాన్ని చాటాడు. ఈ నేపథ్యంలో డీజే టిల్లు ఈ సినిమాతో ఇంకా ఏ వండర్ సాధిస్తాడో తెలియడం లేదు.
సిద్ధూకు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఇలా సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాతో మరో విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు. డీజే టిల్లు మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడిగా ఎదిగాడు.
ఈ సినిమాలో సిద్ధు, అనుపమ పరమేశ్వరన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టిల్లు స్క్వేర్ లో సిద్ధు నటన కూడా మంచి స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఇలా సిద్ధు తన రెండో సినిమా కూడా మొదటి సినిమా రేంజ్ లో ఉంటుందని ఆశిస్తున్నారు. టిల్లు స్క్వేర్ సినిమా ప్రేక్షకుల్లో ఎంతటి వండర్ క్రియేట్ చేస్తుందో చెప్పలేం.