
బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించే విస్తారక్ లను రాష్ర్టాలకు పంపుతుంది. విస్తారక్ లు పోలింగ్ బూత్ లవారీగా పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. గత ఏడాది డిసెంబర్ లో 12 రాష్ర్టాల నుంచి బీజేపీ విస్తారక్ లు రాష్ర్టానికి వచ్చారు. అప్పుడు లోక్ సభ నియోజకవర్గ స్థాయిలో విస్తారక్ ల సమావేశం నిర్వహించారు.
ఎవరీ విస్తారక్ లు..
2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో రాజకీయ పార్టీలకు ఈ సంవత్సరం చాలా కీలకం. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా సుమారు 3,000-3500 మంది విస్తారక్ (విస్తరణకర్తలు) బలగాలను మోహరించాలని నిర్ణయించింది. ఇది మెగా ప్లాన్‌లో భాగంగా వచ్చింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఈ విస్తారక్ లు కీలకంగా పని చేస్తారు. వీరు పార్టీ అధిష్టానంతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటారు. వీరంతా పార్టీ సిద్ధాంతాలు, నిబంధనలకు కట్టబడి ఉంటారు. వీరు పార్టీ ఫుల్ టైమ్ కార్యకర్తలు. వీరంతా 35 ఏళ్లలోపు వారే కావడం విశేషం. వీరికి నిర్దేశించిన ప్రాంతంలో పార్టీ పరిస్థితి, నాయకుల మధ్య సమన్వయం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను నేరుగా అధిష్టానికి నివేదిస్తారు. అధిష్టానానికి వీరు చెప్పిందే ఫైనల్. విస్తారక్ ల ప్రాధాన్యం ఆర్ఎస్ఎస్ నుంచి అనుబంధం ఉన్న వారికే తెలుస్తుంది. బీజేపీలో కొత్తగా చేరిన వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఈ విషయాలపై అవగాహన ఉండకపోవచ్చు. పార్టీ గ్రౌండ్ రిపోర్ట్‌ను సిద్ధం చేసేది కూడా వీరే. చేస్తారని భావిస్తున్నారు”
119 అసెంబ్లీ నియోజక వర్గాలకు
తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో విస్తారక్‌లను బీజేపీ బరిలోకి దింపింది.కాగా వీరంతా స్థానికేతరులే. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల బాధ్యతలను విస్తారక్‌లకు బాధ్యతలు అప్పగించింది. అహ్మదాబాద్ నుంచి ఎక్కువ సంఖ్యలో విస్తారక్ లను తెలంగాణ కు పంపించారు. వీరంతా తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌ల తమ పనిని ప్రారంభించారు. బీజేపీ తెలంగాణలో గెలవాలంటే ఏం చేయాలన్నదానిపై ఈ ఆరు వందల మంది అధిష్టానికి నేరుగా ఫీడ్ బ్యాక్ ఇస్తారు.
లాభం చేకూరేనా..?
కర్ణాటకలో అధికారం కోల్పోయిన బీజేపీకి తెలంగాణ లోనూ మళ్లీ మునుపటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. మొన్నటి దాకా కనిపించిన జోష్ రోజురోజుకూ సన్నగిల్లుతున్నది. ఓ వైపు కాంగ్రెస్ బలపడడం, మరో వైపు బీఆర్ ఎస్ బీజేపీ ఒక్కటేనని హస్తం నేతలు చేస్తున్న ఆరోపణలు కమలదళానికి నష్టాన్ని చేకూర్చుతున్నాయి.
ReplyForward
|