33.2 C
India
Monday, February 26, 2024
More

  Keshineni Nani : సీఎం జగన్ తో కలిసి పని చేస్తా.. చంద్రబాబుపై కేశినేని నాని కీలక వ్యాఖ్యలు?

  Date:

  Keshineni Nani
  Keshineni Nani and CM Jagan

  Keshineni Nani : 2013 జనవరి నుంచి టీడీపీ అభివృద్ది కోసం పని చేస్తూ వచ్చినా నా సేవలు టిడిపి గుర్తించ లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేశినేని నాని కలిశారు. దీంతో నాని వైఎస్ఆర్సిపి లో చేరడం ఖాయమని తెలుస్తోంది. జగన్ కలిసిన తర్వాత నాని టిడిపి నాయకత్వంపై పలు విమర్శలు చేశారు.2014 ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను నా భుజస్కందాల మీద వేసుకుని చేశానని నాని అన్నారు.

  కొంతమందికి ఆరోజు నెలవారీ జీతాలు కూడా నా చేతుల మీదుగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని  నా సొంత వ్యాపార సంస్థ కన్నా.. టీడీపీ గెలుపే ముఖ్యంగా పని చేసిన నన్ను చంద్రబాబు నాయుడు నన్ను పక్కన పెట్టేయడం ఆవేదన కలిగించిందన్నారు. 2019 ఎన్నికల సమయంలో నాకు సీటు ఇచ్చేందుకు ఇబ్బంది పెట్టారని ప్రజాగ్రహం చూసి ఆ తర్వాత మళ్లీ నాకే సీటు ఇచ్చారన్నారు. నేను అక్రమ సంపాదనకు ఆశపడకుండా పార్టీ, ప్రాంతం కోసం పని చేశానని నాని తెలిపారు. టిడిపి కోసం వ్యాపారం మానుకున్న ఆస్తులు కూడా అమ్ముకున్నా అని నాని తెలిపారు. వ్యాపారం కాకుండా హైదరాబాద్ లో రెండు వేల కోట్లు ఆస్తులు నేను అమ్ముకున్నాను అన్నారు.

  కొన్ని విషయాలలో చంద్రబాబు నా పట్ల ప్రవర్తించి న తీరు వల్ల నేను వ్యాపారం వదిలాను. 2019 ఎన్నికలలో నారా లోకేష్ ఓడిపోయారు. నేను ఎంపీగా ఇక్కడ గెలిచాను.. ప్రజల అభిమానం పొందాను అని ఆయన అన్నారు. ఆ తర్వాత వారి మనుషులను పెట్టి.. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. మేయర్ ఎన్నికలు వచ్చిన సమయంలో.. చంద్రబాబు అడిగితే ఇన్ ఛార్జిలు ఇష్టం అని చెప్పాను. బోండా ఉమా  సతీమణిని పెడుతున్నారా.. అదే జరిగితే చాలా ప్రమాదకరం అని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత నా కుటుంబం నుంచి ఒకరు ఉంటే బాగుంటుందని ఒత్తిడి తెచ్చారు.

  టాటా సంస్థల్లో పని చేస్తున్న నా కుమార్తె శ్వేతను తీసుకువచ్చి పోటీ చేయించాను. ఎన్నికల సమయంలో కొంతమంది వ్యక్తులను తీసుకు వచ్చి నన్ను తిట్టించారు. ఎంపీ నానిని చెప్పు తీసుకుని కొడతాను అని ఒక క్యారెక్టర్ లెస్ పర్సన్ అన్నాడు. ఒక పొలిట్ బ్యూరో సబ్యుడు నన్ను గొట్టం గాడు అన్నాడు. పార్టీ నుంచి ఈ విమర్శలపై కనీసం స్పందన లేదు. చంద్రబాబు తో ప్రచారానికి రావద్దని నాకే చెప్పారు.

  చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి మోసగాడు.. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని నాని  విమర్శిం చారు. ప్రజలు ఏమనుకుంటారో   నాకు తెలియ దు.. జగన్ పేదల పక్షపాతి అని రుజువు చేసుకున్నారు. కోవిడ్ వల్ల అభివృద్ది అనుకు న్నస్థాయిలో చేయలేకపోయారు. రెండు లక్షల కోట్ల రూపాయలు పైగా ప్రజలకు సంక్షేమ పధకాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణిం చాలని నిర్ణయించుకున్నాను.ఇక నుంచి ఆయనతో కలిసి పయనిస్తాను  అని నాని తెలిపారు.

  Share post:

  More like this
  Related

  India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

  India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

  Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

  Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

  Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  CM Jagan : జగన్ కు మరో హెలీకాప్టర్, నెలకు రూ.2 కోట్లు అద్దె?

  CM Jagan : రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి ముఖ్యమంత్రి...

  Sharmila Mass Warning : నన్నే అరెస్ట్ చేపిస్తావా.. జగన్ నీ అంతు చూస్తా.. షర్మిల మాస్ వార్నింగ్

  Sharmila Mass Warning : గుంటూరు: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇ వ్వాలని...

  Nara Lokesh : జగన్ తన ప్రసంగంలో ‘నాయుడు’ అని ఎన్నిసార్లు ప్రస్తావించారో తెలుసా? నారా లోకేశ్ ఆసక్తి కర ట్వీట్..

  Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంను...

  CM Jagan : ఐప్యాక్ బృందంతో సీఎం మంతనాలు..

  CM Jagan : అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మొత్తం 175...