Sharmila Mass Warning : గుంటూరు: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇ వ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని అడిగితే పోలీసులు ఎం దుకు అరెస్ట్ చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. జాబ్ క్యాలెం డర్ ఏమైందని నిలదీశారు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.
మెగా డీఎస్సీ పేరుతో సీఎం జగన్ (CM Jagan) దగా డీఎస్సీ ఇచ్చారని మండిపడ్డారు. గురువారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వారస త్వం అంటే ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు. మ హిళనని కూడా చూడకుండా తనను రాత్రి సమ యంలో పోలీసు స్టేషన్‌లో ఉంచారని విరుచుకు పడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో తన చేతికి గాయమైందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
నన్నే అరెస్ట్ చేపిస్తావా.. జగన్ నీ అంతు చూస్తా’ అంటూ సొంత అన్న, సీఎం జగన్‌కి షర్మిల మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు తన పరిస్థితిని చూసి తన తండ్రి దివంగత మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని, తన తల్లి ఎంతో బాధపడుతుం దని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సచివాలయంలో వినతి పత్రం ఇద్దామని వస్తే ఎవ్వరూ అందుబాటులో లేని పరిస్థితి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సచివాల యానికి ఎందుకు రారని ప్రశ్నించారు. చివరకు సీఎస్ కూడా సచివాలయంలో ఉండరన్నారు. ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు.
ఏపీలో అసలు పరిపాలన లేదన్నారు. విశాఖప ట్నం స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కాపాడట్లేదని మండిపడ్డారు. పోలవరం ఇంకా పూర్తి చేయలేక పోయారని చెప్పారు. రైతులకు పంట బీమా కూ డా ఇవ్వలేదని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.