AP One Chance : కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అందుకే మంత్రి వర్గంలోకి మరికొందరినీ తీసుకొని జంబో టీం సిద్ధం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే సోమవారం పలువురు మంత్రలతో మోదీ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి వర్గ కూర్పుపై చర్చించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా మరికొన్ని రాష్ర్టాలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
అయితే మంత్రివర్గ విస్తరణలో ఈసారైనా ఏపీకి చాన్స్ దక్కుతుందా లేదా అనేది సంశయంగానే కనిపిస్తున్నది. ప్రతి సారి తమ రాష్ర్టానికి చోటు దక్కుతుందని ఆశపడుతున్న వారికి నిరాశే ఎదురవుతున్నది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలకు కూడా కేబినెట్లో చోటు దక్కింది. కానీ ఏపీకి మాత్రం.. కేంద్రమంత్రి లేకుండా పోయారు.
బీజేపీ తరపున ఏపీ నుంచి ఎంపీలు ఎవరూ లేరు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్, సుజనా చౌదరి మాజీలయ్యారు. కేవలం సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు ఇద్దరే ఉన్నారు. అయితే జీవీఎల్ యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో సీఎం రమేశ్ ఒక్కరే ఏపీ నుంచి ఉన్నారు. మరి ఈ సారి ఏపీకి చాన్స్ ఉంటుందా.. లేదా అనేది బీజేపీ హైకమాండ్ నుంచి మాత్రం ఎలాంటి టాక్ బయటకు రావడం లేదు. ఏపీకి ఓ కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే.. సీఎం రమేష్ లేదా జీవీఎల్ కు మాత్రమే చాన్స్ ఉంది. ఇంకెవరిని తీసుకున్నా వారికి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ సారి మరో బీసీ నేతకు మంత్రి కి అవకాశం ఇస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల ఓబీసీ మోర్చా . అధ్యక్షుడు లక్ష్మణ్ కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆయనతో పాటు ఇద్దరు లోక్ సభ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఉన్నారు. బండి సంజయ్ ప్రస్తుతం టీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు ధర్మపుర అర్వింద్ ఎంపీగా గెలవడం ఇదే తొలిసారి. దీంతో లక్ష్మణ్కు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా కేంద్ర మంత్రి అసలు తెలుగు రాష్ర్టాలకు చాన్స్ ఉంటుందా.. లేదా అనేది కూడా ఇంకా సంశయంగానే ఉంది. అయితే తెలంగాణపై బీజేపీ దృష్టి ఉంటే కచ్చితంగాతెలంగాణ వ్యక్తికే దక్కే చాన్స్ ఉంది. ఏపీపై పెద్దగా పట్టింపు అవసరం లేదని బీజేపీ భావిస్తున్నది. సో ఏపీకి మరోసారి మొండిచేయి తప్పదని అంతా అనుకుంటున్నారు. మరి ప్రధాని మోదీ మనసులో ఏ లెక్కలు ఉన్నాయో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..
ReplyForward
|