
YSRTP-Congress : ఎన్నికలకు ఇంకా ఆరు నెలల గడువు కూడా లేదు.. ఇప్పటికీ వైఎస్సార్ టీపీకి ప్రజల్లో ఆదరణ కనిపించడం లేదు. దీంతో ఆ పార్టీ నాయకులు, కేడర్ నిరాశకు లోనవుతుంది. ఎన్నికల వరకు పార్టీ పోటీ చేస్తే విజయ గురించి ఊహించకున్నా ఒకటి, రెండు సీట్లు దక్కుతాయా అంటూ అనుమానాలు వ్యక్తం అవతుున్నాయి. దీంతో పార్టీలోని ముఖ్య నాయకులు ఏదైనా పార్టీతో పొత్తుపెట్టుకుందామని శర్మిలకు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్ టీపీ ఏర్పాటు తర్వాత తెలంగాణలో ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందులు, యువకుల మొరను శర్మల పాదయాత్ర ద్వారా తెలుసుకున్నారు. వారి కోసం ముందుండి పోరాడారు. సామన్య ప్రజానికం, రైతుల కోసం ప్రభుత్వంతో పోరాడుతానని ఆమె వారికి హామీలు ఇస్తూ వచ్చారు. కానీ రాను రాను ఆమె చరిష్మా బాగా తగ్గుతూ వస్తోంది. పార్టీ ప్రారంభంలో యాక్టి్వ్ గా ఉన్న ఆమెను తెలంగాణ ప్రజలు మాత్రం అక్కున చేర్చుకోలేక పోతున్నారు.
ఆమె మీడియా మీట్ సంచలనం మాట అటుంచితే సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ కు గురవుతుంది. షర్మిల రాజకీయంగా ఇంకా పరిపక్వత చెందాలని సొంత పార్టీ నేతలే అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఏదైనా పార్టీతో (YSRTP-Congress ) పొత్తు పెట్టుకుంటేనే కనీసం పరువు దక్కుతుందని భావిస్తున్నారు. దీనిలో భగంగా కాంగ్రెస్ తో పొత్తు (YSRTP-Congress) పెట్టుకుందామని చెప్తున్నారు. దీనికి కేవలం తమ పార్టీకి 5 సీట్లు కేటాయిస్తే చాలని సూచిస్తున్నారట. అయితే దీనిపై శర్మల ఇప్పటి వరకూ స్పందించలేదని తెలుస్తోంది.