
Windstorm in America : ఉదయం పూట అమెరికాలో గాలులు బలంగా వీచాయి. అమెరికాలోని యుటా , నెవాడా రాష్ట్రాలలోని వీధులు, హైవేలు , పక్కన బస చేసే ప్రాంతాలను ఎండిన మొక్కలతో నిండిపోయాయి. 2024 మేలో జరిగిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఆన్‌లైన్‌లో పంచుకున్న వీడియోల్లో యుటాలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా తుంబుల్‌వీడ్స్ (గులాబి రకం మొక్కల ఎండు భాగాలు) చేరినట్లు చూపించాయి. ఇళ్ల చుట్టూ కొన్ని అడుగుల ఎత్తున పేరుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ సమీపంలోని పహ్రంప్‌లో కూడా వీధులన్నీ తుంబుల్‌వీడ్స్‌తో నిండిపోయాయి.
తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల పశ్చిమ యునైటెడ్ స్టేట్స్‌లో 60 mph కన్నా ఎక్కువ వేగంతో గాలులు వీచాయి. ఇది చెట్లు కూలిపోయేందుకు, మౌలిక సదుపాయాలకు నష్టం కలగడానికి, విద్యుత్ కోతలకు ఈ గాలిదుమారం కారణమైంది. సాల్ట్ లేక్ సిటీకి దక్షిణాన ఉన్న సౌత్ జోర్డాన్ నివాసితులు తమ ప్రాంతాన్ని శుభ్రం చేయడం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత, నగర అధికారులు సహాయాన్ని అందించారు.
– తుంబుల్‌వీడ్ ఎలాంటి మొక్క?
తుంబుల్‌వీడ్స్ ఒక ప్రకాశవంతమైన ఆకుపచ్చని మొక్క. ఇది ఎలుకలు, ప్రాంగ్‌హార్న్‌లు , బిగ్‌హార్న్ మేకల కోసం ఆహార వనరుగా ఉపయోగపడుతుంది. ఇది ఎదిగి, ఎండిపోయిన తర్వాత, మొక్క రూట్ వద్ద తెగిపోయి గాలిలో కొట్టుకుపోతుంది.