
Woman Flute Talent : కళ నిద్రపోతున్న జాతిని మేల్కొలిపేది. కళాకారులకు అంతటి విలువ ఉంటుంది. కళాకారులు అన్నింటిని శాసిస్తారు. రాజకీయాల్లో కూడా కళాకారుల పాత్ర ఉంటుంది. అభిమానులను మంత్రముగ్దులను చేయడంలో కళాకారుల పాత్ర ఎంతో ఉంటుంది. వారి ప్రతిభతో ఎందరినో ఆకట్టుకుంటారు. వారు పాడితే ప్రేక్షకులు ఉర్రూతలూగుతారు. ఈవెంట్ మధ్యలో వారిని నోట్లతో ముంచిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా గుజరాత్ లో ఇలాంటి ఘటన ప్రత్యక్షమైంది. ఇక్కడ నిర్వహించిన ఓ కచేరిలో అభిమానులు నోట్ల వర్షం కురిపించడం గమనార్హం. సుమారు రూ.50 లక్షలు కళాకారులపై చల్లారంటే వారికి ఆ కార్యక్రమం ఎంతగా నచ్చిందో అర్థమవుతుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానముంటే ఇంతటి స్థాయిలో ఉంటుందా అని అందరు ఆశ్చర్యపోతున్నారు.
గుజరాత్ లోని నవ్ సారి జిల్లాలోని సుపా గ్రామంలో స్వామి వివేకానంద ఐ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భజన్ కార్యక్రమం నిర్వహించారు. కంటి సంబంధిత సమస్యలతో బాధపడే వారి కోసం విరాళాలు సేకరించే ఉద్దేశంతో జరిగిన ప్రోగ్రామ్ లో ప్రముఖ గాయకుడు కీర్తిదాస్ గధ్వి తనదైన గానంతో ఆకట్టుకున్నాడు. దీనికి అభిమానులు ఫిదా అయిపోయారు.
ఈ గాన కచేరిలో మహిళ కళాకారిణి కూడా తన ప్రతిభను చూపించింది. ఆమె చేసిన వేణుగానం అందరిని ఆకట్టుకుంది. ప్రేక్షకులు సంతోషపడి డబ్బుల వర్షం కురిపించారు. కార్యక్రమం జరుగుతున్నంత సేపు నోట్లు రాలుతూనే ఉండటం గమనార్హం. ఇలా కళాకారులు చూపిన టాలెంట్ కు ఫిదా అయిపోయారు. ఆమె పాడుతున్నంత సేపు ఉర్రూతలూగిపోయారు. కళాకారులపై లక్షల్లో నోట్లు పడటంతో అందరు ఆనందం వ్యక్తం చేశారు.