Big TV పనులు అందరు చేస్తారు. కానీ కొందరు మాత్రమే వాటిని వినూత్నంగా చేస్తారు. దీంతో బుల్లితెరలో మరో విప్లవానికి నాంది పలికారు. ఎలక్ర్టానిక్ మీడియా రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. రంగంలోకి దిగిన బిగ్ టీవీ సాంకేతికత ఉపయోగించుకుని దూసుకుపోతోంది. మీడియా రంగంలోకి అడుగుపెట్టిన బిగ్ టీవీ మే 11న శాటిలైట్ అనుమతులు తీసుకుని ప్రేక్షకులకు చేరువవుతోంది.
మర బొమ్మచే వార్తలు చదివించడానికి నిర్ణయించుకున్నారు. చీరకట్టు, నుదుటిన బొట్టుతో న్యూస్ రీడర్ ను తయారు చేయించుకుంది. దేశంలోనే తొలి అడుగు వేయబోతోంది. బిగ్ టీవీ యాజమాన్యం కదనరంగంలోకి దూకింది. వార్తలను చదివించే ప్రక్రియ ఓ మరబొమ్మ ద్వారా చేస్తే ఎలా ఉంటుందోనని ట్రయల్ వేద్దామని చూశారు. ఇందులో భాగంగానే కొత్త మలుపు తిప్పాలని బావిస్తోంది.
మంగళవారం మరబొమ్మతో రోజుకు రెండు సార్లు వార్తలు చదివించాలని ప్రయత్నించి సక్సెస్ అయింది. దీంతో బిగ్ టీవీపై అందరికి ఆసక్తి పెరుగుతోంది. 15 మంది ఉద్యోగులు ఆమెతో వార్తలు చదివించేందుకు పనిచేస్తున్నారని సమాచారం. స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం తెలుగు మీడియా రంగంలో సాంకేతిక విప్లవం వైవిధ్యమైన ఫలితాలు ఇస్తోంది. ఇలా ప్రేక్షకుల్లో బిగ్ టీవీ చేస్తున్న ప్రయోగం రానున్న కాలంలో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత చేరువ కానుంది.
బిగ్ టీవీ చేస్తున్న కృషిని అందరు అభినందిస్తున్నారు. యాజమాన్యం కదనరంగంలోకి దూకి టాప్ రేటింగ్ ఉన్న చానల్స్ కన్నా ముందే ఏఐ న్యూస్ రీడర్ ద్వారా వార్తలు చదివించే పనికి శ్రీకారం చుట్టింది. వార్తా రంగంలో కదం తొక్కుతూ ముందుకు సాగడంపై అందరు హర్షిస్తున్నారు. బిగ్ టీవీ చేస్తున్న పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. బుడిబుడి అడుగులు వేస్తున్న బిగ్ టీవీ చేస్తున్న ప్రయత్నం ఎన్ని ఫలితాలు ఇస్తుందో తెలియడం లేదు.