
Mumbai Metro : తాజాగా ముంబై మెట్రోలో భోజ్ పురి పాటకు ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ కనిపించిన వీడియోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. @mumbaimatterz యూజర్ నేమ్ లో ఈ వీడియోను X లో పోస్టు చేశారు. దీన్ని GRP ముంబై, DRM ముంబై, రైల్వే మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేసి యువతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వీడియోలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. యువతి ముంబై లోకల్ ట్రైన్లలో జనరల్, లేడీస్ కోచ్ లు, CMST స్టేషన్ ప్లాట్ ఫారమ్ లో రెచ్చగొట్టేలా డ్యాన్స్ చేస్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ముంబై లోకల్ ట్రైన్లలో హ్యాకర్స్, బెగ్గర్స్, ఇప్పుడు రీల్ మేకర్స్ ప్రయాణికులను ప్రశాంతంగా ప్రయాణించకుండా చేస్తున్నారని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. రైల్వే అధికారులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాశారు.
ఈ పోస్టుపై ముంబై సెంట్రల్ డీఆర్ఎం ఎట్టకేలకు స్పందించారు. సమాచారం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆ యువతిపై చర్యలు తీసుకుంటామని రిప్లై ఇచ్చారు.