
ప్రస్తుతం ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో ఇద్దరు ఆడవాళ్లు సిగలు పట్టుకొని రోడ్డుపైనే కొట్టుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగిన ఘటన ఇది. సెవెందు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుత్తూరు లో కొట్టుకున్న మహిళలు ఇరుగుపొరుగున జీవిస్తున్నారు. ఓ విషయమై వీరిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మాట మాట పెరిగే చేతల వరకు వచ్చింది. ఇక రోడ్డుమీదనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఒంటిపై దుస్తులు ఊడిపోతున్నా పట్టించుకోకుండా జుట్లు పట్టుకొని రోడ్డుపై కింద మీద పడ్డారు. వీరిని విడిపించేందుకు ఓ మగాడు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక అక్కడితో ఆగలేదు. మరికొందరు మహిళలు కూడా ఇందులో జాయిన్ అయ్యారు. ఇంకేం సీన్ రక్తి కట్టింది. కలిసి తన్నుకోవడం చూస్తున్న వాళ్లకి మంచి ఎంటర్టైన్మెంట్ లా మారింది. ఇక ఈ ఘటనను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పలువురు కామెంట్లు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.. .
ReplyForward
|