
Shekhar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన పాటలలో పెడుతున్న హుక్ స్టెప్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆయన ప్రతి సినిమాలోనూ అసభ్యకరమైన హుక్ స్టెప్స్‌ను కంపోజ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ చిత్రంలోని ‘అదిదా సర్ప్రైజ్’ అనే పాటలోని కొన్ని స్టెప్పులు చాలా అసహ్యంగా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.
దీనిపై మహిళా కమిషన్ కూడా స్పందించడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కొన్ని స్టెప్పులు అసభ్యకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే మార్చాలని మహిళా కమిషన్ చిత్ర నిర్మాతలకి నోటీసులు జారీ చేసింది. దీంతో నిర్మాతలు ఇప్పుడు ఆ స్టెప్పులను కొత్తగా రీ కంపోజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.