CAA Womens Day Celebrations : యూఎస్ చికాగో ఆంధ్రా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గత శనివారం స్థానిక నేషనల్ ఇండియా హబ్ లో ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెద్దమల్లు, ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణ మతుకుమల్లి, గీతిక మండల, అనురాధ గంపాల, సౌమ్య బొజ్జల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ సంఖ్యలో చికాగో స్థానిక ప్రవాస మహిళలు హాజరయ్యారు. కృష్ణ జాస్తి, తమిశ్ర కొంచాడ వేదికను అందంగా అలంకరించారు.
జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం గణపతి ప్రార్థనా గీతం ఆలపించారు. డాక్టర్ సైని నర్ వాదే, మాలతీ దామరాజు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఫ్యాషన్ షో, వ్యర్థాలతో నగల రూపకల్పన, బొమ్మల అలంకరణ వంటి కళా నైపుణ్యాన్ని, సృజనాత్మకతను ఆవిష్కరించారు. నిర్మా, అంబికా దర్బార్ బత్తి వంటి ప్రకటనలకు అభినయించి ఆకట్టుకున్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఐదుగురు మహిళలకు విలువైన పట్టుచీరలు బహుకరించారు.
నరేశ్ చింతమాని, సూజాత అప్పలనేని భోజన ఏర్పాట్లు పర్యవేక్షించారు. మయూరి సహకారంతో మహిళలు డ్యాన్స్ ఫ్లోర్ పై ఉత్సాహంగా చేశారు. సంస్థ ధర్మకర్తలు డాక్టర్ భార్గవి నెట్టెం, పవిత్ర కరుమూరి, డాక్టర్ ఉమ కటికి, మల్లీశ్వరి పెదమల్లు, శివబాల జట్ల, సూర్య దాట్ల, అరుణ దాట్ల, సవిత మునగ, అనూష బెస్త, శైలజ సప్ప, శ్రీ స్మిత నండూరి, అన్వితా పంచాగ్నుల, మురళీ రెడ్డివారి, పద్మారావు అప్పలనేని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, గిరిరావు కొత్తమాసు, మనస్వి తూము, కావ్యశ్రీ చల్ల తదితరులు పాల్గొన్నారు.