
Minister Ambati :
ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గంలోనే నిరసనలు ఎదురవుతున్నాయి. ఇటీవల ప్రతిపక్ష నాయకులను ఎద్దేవా చేసినట్లు మాట్లాడుతూ మంచి ఊపు మీదున్న ఆయనకు పాపం జనం నుంచి మాత్రం ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని టాక్ బయటకు వస్తున్నది. పలు సర్వేల్లోనూ ఇదే వ్యక్తమవుతున్నది. ఇక తాజాగా ఆయనకు ఎదురైన ఘటన మరింత షాక్ ఇచ్చింది. రాష్ర్టంలో ఏ నియోజకవర్గంలో చూసినా వైసీపీ నేతలకు ఇలాంటి నిరసనలే ఎదురవుతున్నాయి.
సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో గురువారం మంత్రి అంబటి రాంబాబు గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన గ్రామంలో పర్యటిస్తుండగా, మహిళలు ఆయనను నిలదీశారు. వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ తమను వేధిస్తున్నాడంటూ నిలదీశారు. అయితే మహిళలు ఒక్కసారిగా ఎదురుతిరగడంతో, మంత్రి అంబటి మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. అయితే తనకు నిరసన ఎదురవుతుందని తెలుసుకున్నారో, లేదంటే పోలీసులకు బాస్ మీద భక్తి ఎక్కువయ్యిందో తెలియదు కానీ, పెద్ద సంఖ్యలో గ్రామంలో మోహరించారు.
ఇక ఆ పోలీసుల సహకారంతో గ్రామంలో మిగతా పర్యటన పూర్తి చేశారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే మంత్రి అంబటి రాంబాబు పర్యటన నేపథ్యంలో సొంత పార్టీ ఎంపీటీసీ ఆలేఖ్య, ఆమె భర్త కృపారావును హౌస్ అరెస్ట్ చేయించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఆయన కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం, మంత్రి అంబటి తీరుపై విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇంతకాలం ప్రతిపక్ష పార్టీల నుంచే వైసీపీ నేతలకు ఇబ్బందులు అనుకుంటే, ఇప్పుడు సొంతపార్టీలోనే కుంపటి మొదలైంది. ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ర్టవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి ఘటనలు అధిష్టానానికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ఏకంగా సొంత పార్టీ ప్రజాప్రతినిధినే గృహ నిర్భంధంలో ఉంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి ప్రశ్నించుకోవాలని ప్రత్యర్థి పార్టీల నేతలు కోరుతున్నారు.
#AndhraPradesh #NalugellaNarakam… pic.twitter.com/bwyj4sZsBV
— Telugu Desam Party (@JaiTDP) October 5, 2023