Home EXCLUSIVE World Record : ఆంధ్రాలో వండర్ కిడ్.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల...

World Record : ఆంధ్రాలో వండర్ కిడ్.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల పాప.. ఈ బేబీ టాలెంట్ సూపర్..!

26
World Record
World Record

World Record : నందిగామకు చెందిన ఓ చిన్నారి నాలుగు నెలల వయసులో వండర్ క్రియేట్ చేస్తోంది. ఒకటి రెండు వస్తువులు కాదు ఏకంగా 120 వస్తువులను గుర్తించి వరల్డ్ రికార్డ్ సాధించింది. పాప కంటి చూపు మెరుగుపర్చడం కోసం సన్నిహితుల సలహాతో బ్లాక్ అండ్ వైట్ కార్డులను చూపించడం మొదలు పెట్టిన తల్లి.. తన కుమార్తె ఆ కార్డులను శ్రద్ధగా చూస్తుండటాన్ని గమనించి మరింత తర్ఫీదు నిచ్చింది.

నాలుగు నెలల వయసున్న చిన్నారులు తమ దగ్గరున్న వస్తువులను చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. చేతులను నోట్లో పెట్టుకోవాలని చూస్తుంటారు. కొత్త వాటిని చూసినప్పుడు ఎగ్జట్‌ మెంట్ చూపిస్తారు. తల్లిదండ్రులను గుర్తిం చి.. వారు కనిపించినప్పుడు కేరింతలు కొడతారు. ఆకలేసినప్పుడు.. కోపం వచ్చినప్పుడు ఏడుస్తారు. నోటితో చిన్న చిన్న శబ్దాలు చేయడం మొదలుపె డతారు. కానీ కృష్ణా జిల్లా నందిగామకు చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య మాత్రం.. పక్షులు, కూరగాయలు, జంతువులు.. ఇలా 120 రకాల ఫోటోలు గుర్తించి ప్రపంచ రికార్డు్ నెలకొల్పింది.

కైవల్య తల్లి హేమ.. తమ బిడ్డ ప్రతిభను గుర్తించి వీడియో రికార్డ్ చేసి నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపింది. మొత్తం 120 అంశాలను నాలుగు నెలల చిన్నారి గుర్తించడం ఓ రికార్డు అని నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌ గుర్తించింది. ఫిబ్రవరి 13న పాప తల్లిదండ్రులకు ప్రశంస పత్రంతోపాటు పతకాన్ని పంపించింది.

వాస్తవానికి పాప కంటి చూపు మెరుగుపర్చే ఉద్దేశంతో ఆమె తల్లి బ్లాక్ అండ్ వైట్ బొమ్మలున్న కార్డులను చూపించడం మొదలుపెట్టింది. ఆన్‌లైన్లో ఫ్లాష్ కార్డులను కొనుగోలు చేసిన ఆమె.. వాటిని చూపిస్తున్నప్పుడు.. కైవల్య నిశితంగా గమని స్తోందని గ్రహించారు. కార్డును చూపిస్తూ.. దానిపై ఉన్న చిత్రం పేరు చెప్పిన హేమ.. కొద్ది రోజుల తర్వాత రెండు కార్డులు చూపించి.. అందులోని ఓ చిత్రం పేరు చెబితే.. కైవల్య ఆ చిత్రం ఉన్న కార్డును పట్టుకునేది. దీంతో హేమ తన కుమార్తెకు ఇలా కార్డులను మార్చి మార్చి చూపేది.

కైవల్య తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటారు. పాప తండ్రి చల్లగుండ్ల రమేశ్‌ క్వెస్ట్‌ గ్లోబల్‌ అనే కంపెనీలో హార్డ్‌వేర్‌ ఉద్యోగి కాగా.. తల్లి హేమ.. కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్ చేస్తున్నారు.