High-Ranking Officer: ఏ కంపెనీకయినా కార్మికులు, ఉద్యోగులే కీలకం. వారు లేకుంటే కంపెనీ నిలబడడం సాధ్యం కానే కాదు. కార్మికులు బాగుంటేనే కంపెనీ బాగుంటుంది. కానీ ఒక్కోసారి కొందరు పైస్థాయి ఉద్యోగుల మూలంగా కంపెనీలకు చెడ్డపేరు వస్తుంది. ఏన్నో ఏళ్లుగా సంపాదించుకున్న గొప్ప పేరు ఒక్క ఉద్యోగి తప్పు వల్ల పోతుంది. ఈ ఘటన థాయ్ లాండ్ లో జరిగింది. థాయ్ లాండ్ లోని సముత్ ప్రకాన్ ప్రావిన్స్‌లోని డెల్టా ఎలక్ట్రానిక్స్ ఉంది. అందులో మే అనే 38 సంవత్సరాల కార్మికురాలు పని చేస్తుంది. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆమె సిక్ లీవు తీసుకుంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సిక్ లీవు తీసుకుంది. అందుకు తగ్గ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించింది. అనారోగ్యం మెరుగుకాకపోవడంతో హాస్పిటల్ లో చేరింది. నాలుగు రోజులు హాస్పిటల్ లో గడిపింది. ఇక డిశ్చార్జి అయ్యింది. అయితే ఆమెకు ఇచ్చిన సెలవులు ముగిశాయి. దీంతో ఉద్యోగానికి రావాలని పైఅధికారి ఆదేశించారు. అయితే తనకు ఇంకా నయం కాలేదనిన ఒక్క రోజు సెలవు ఇవ్వాలని ఆమె కోరింది. అయితే అందుకు కంపెనీ నిరాకరించింది. దీంతో ఉద్యోగం పోతుందని భయపడిన మే సెప్టెంబర్ 13న పనికి వెళ్లింది. కేవలం 20 నిమిషాలు పని చేసి తను పని చేసే చైర్ లోనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించినా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో కంపెనీ ఆమె మరణంపై ఫేస్ బుక్ లో ఒక పేజీని రిలీజ్ చేసింది.
Breaking News
High-Ranking Officer: పైస్థాయి అధికారి తీరుతో ప్రాణాలు విడిచిన మహిళ.. దేశం మొత్తం దానిపైనే చర్చ
Date: