World Most Power Cars : ఆటో మొబైల్ రంగం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆటో మొబైల్ రంగం విరివిరిగా వినియోగించుకుంటోంది. ఈక్రమంలోనే ఎంతో వేగవంతమైన.. సురక్షితమైన కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. సాధారణ కార్లతోపాటు ఎలక్ట్రిక్ కార్లు సైతం ప్రస్తుతం మార్కెట్లో తమ సత్తాచాటుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పవర్ పుల్ కార్లలో కొన్నింటి పరిశీలించినట్లయితే ముందువరసలో ఫెరారీ నిలుస్తోంది. 980 హర్స్ పవర్ స్పీడుతో ప్రయాణించగలదు. దీనిని ఫెరారీ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత జాబితాలో ల్యాంబోర్ జినిసిన్ (Lamborghini Sian) ఉంది. దీనిని కూడా ఫెరారీ కంపెనీనే తయారీ చేసింది. ఈ రెండు కార్లు ఇటలీలో చాలా ఫేమస్.
అలాగే బటిస్టా(Batista) అనే ఎలక్ట్రిక్ కారును సైతం ఫెనిన్ ఫెరీనా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం 2 సెకన్లలోనే 100కిలోమీటర్ల స్పీడును అందుకోగలదు. ఈ కంపెనీని 2015లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ దీనిని సొంతం చేసుకుంది. ఫెనిన్ ఫెరీనా.. బటిస్టా కార్ల అత్యంత వేగంగా ప్రయాణించే కార్లుగా ఖ్యాతిని గడించాయి. పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియోను వీక్షించండి.